ప్రజలు చంద్రబాబుకు అండగా నిలవాలి: మంత్రి నారా లోకేష్
ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు సీఎం చంద్రబాబు కష్టపడుతున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు.అందువల్ల ఏపీ ప్రజలు అందరూ ఆయనకు అండగా ఉండాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా కరప మండలంలో లోకేశ్ పర్యటించారు.రూ.12 కోట్ల నిధులతో రెండు చోట్ల నిర్మించిన సమగ్ర రక్షిత మంచినీటి పథకాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడారు.
ఏపీ అభివృద్ధికి టీడీపీ సర్కారు పాటుపడుతోందని అన్నారు. అయితే విపక్షం ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. విపక్షం చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గ్రామాలను అభివృద్ధి చేసేందుకే తాను పంచాయతీ రాజ్ శాఖను తీసుకున్నానని చెప్పారు. డ్వాక్రా మహిళలకు ఇప్పటికే రూ.6 వేల కోట్లు ఇచ్చామన్నారు. మరో రూ.4 వేల కోట్లు త్వరలోనే ఇస్తామని చెప్పారు.నారా లోకేష్ పర్యటన సందర్భంగా వేళంగి గ్రామానికి చెందిన 100 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.