Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Nara Rohit Tuntari Movie Release More Than 600 Screens

By   /  March 10, 2016  /  Comments Off on Nara Rohit Tuntari Movie Release More Than 600 Screens

    Print       Email

Tuntari1

600పైగా స్క్రీన్స్లో ‘తుంటరి’ రిలీజ్..

InCorpTaxAct
Suvidha

 

 

నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘తుంటరి’. ఈ సినిమాని అత్యధిక స్క్రీన్స్ లో ప్రదర్శించబోతున్నారు. ఇప్పటివరకు ఇంచుమించు మూడు లేదా నాలుగు వందల థియేటర్లలో మాత్రమే ఈ హీరోగారి సినిమాలు విడుదలయ్యేవి. అలాంటిది ఈ సారి తుంటరి సినిమా స్క్రీన్స్ ని బాగా పెంచేశారు. కథలో మంచి కంటెంట్ ఉండటంతో చిత్ర యూనిట్ మూవీ హిట్ పై ఎంతో నమ్మకంతో ఉంది. ముఖ్యంగా ఈ సినిమా తమిళ మూవీ మాన్ కరాటే ఆధారంగా తెరకెక్కించారు. అక్కడ మాన్ కరాటే ఇంచుమించు 55 కోట్లు రాబట్టుకుంది. అలాగే తెలుగులో కూడా నిర్మాతలకు ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో తుంటరిని 600 స్క్రీన్లలో రిలీజ్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

నారా రోహిత్ ఇందులో బాక్సర్ గా కనిపిస్తారు. తనకు ఏది తెలిస్తే.. అదే నిజం అని నమ్మే ఓ ఇన్నోసెంట్ ఫెలో అని దర్శకుడు కుమార్ నాగేంద్ర చెబుతున్నారు. అందుకే ఈ తరం ప్రతి ఒక్క కుర్రాడికి తుంటరి సినిమా కనెక్ట్ అవుతుందని ఆయన నమ్మకంగా చెబుతున్నారు. తన గత చిత్రాల తాలూకు ప్రభావం ఈ మూవీపై ఏమాత్రం ఉండదని కూడా చెబుతున్నారు. దానికి కారణం కంటెంట్ అని భావిస్తున్నారు. మరో కారణం హీరోగా నారా రోహిత్ నటించడమేనని అంటున్నారు. రోహిత్ నటనే సినిమాకి హైలెట్ అని చెబుతున్నారు. ఈనెల 11న విడుదలవుతున్న తుంటరి సినిమాకి ఇప్పటికే బోలెడంత టాక్ వచ్చేసింది. పాటలు… పోస్టర్ల దగ్గర్నుంచి ట్రైలర్ల వరకు అన్ని రకాలుగా సినిమాకి ఫుల్ క్రేజ్ వచ్చేసింది. మరి థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి మరి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →