
రచన-శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు
స్వరరచన-శ్రీ పాలగుమ్మి విశ్వనాధం గారు
****
విశేషాలు-
ఈ పాట నా చిన్నతనంలో తరచుగా ఆకాశవాణి ,విజయవాడ కేంద్రం నుండి వినేవాడిని.పాట పాడినవారు శ్రీరంగం గోపాలరత్నం గారనుకుంటాను.ఈ పాట ఎవరి వద్దనైనా ఉంటే,దయచేసి నాకు పంపగలరు.
ఈ పాటకు స్వరాలను కూర్చింది పాలగుమ్మి విశ్వనాధం గారు. మత విద్వేషాలు చెలరేగుతున్న ఈ రోజుల్లో ,మత సహనాన్ని గురించి ప్రబోధించే ఈ పాటను పిల్లలకు పాఠ్యాంశంగా చేర్చటం ఎంతైనా అవసరం!
******
నారాయణ నారాయణ
నారాయణ నారాయణ అల్లా అల్లా
మా పాలిట తండ్రీ నీ పిల్లలమేమెల్లా ( నారాయణ)
మతమన్నది నాకంటికి మసకైతే
మతమన్నది నా మనసుకు మబ్బైతే
మతం వద్దు గితం వద్దు మాయామర్మం వద్దు ( నారాయణ )
ద్వేషాలు రోషాలు తెచ్చేదే మతమైతే
కలహాలు కక్షలు కలిగించేదే గతమైతే
మతం వద్దు గతం వద్దు
మారణ హొమం వద్దు ( నారాయణ)
మతమన్నది గాంధీజీ హితమైతే
మతమన్నది లోకానికి హితమైతే
హిందువులం ముస్లిములం
అందరము మానవులం,
అందరమూ సోదరులం ( నారాయణ )
సందేశాత్మకమైన ఈ పాటను ఇక్కడ https://www.youtube.com/watch?v=QYL0_GerP54 వినండి!
టీవీయస్.శాస్త్రి

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.