Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Narayana- CPI

By   /  June 12, 2016  /  Comments Off on Narayana- CPI

    Print       Email

Narayanaప‌వ‌న్ హీరో కాదా? జోక‌రా?

 

InCorpTaxAct
Suvidha

 

 

జ‌న‌సేన అధినేత, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయాల‌కు ప‌నికిరాడా? ప‌వ‌న్ హీరో కాదా?  జీరోనా? ఆయ‌న అస‌లు నాయ‌కుడే కాదా? ప‌బ్బం గ‌డుపుకునేందుకే నీతులు చెబుతున్నాడా? అంటే అవున‌నే అంటున్నాడు సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి కె.నారాయ‌ణ‌. ఒక కాపు వ్య‌క్తి అయి ఉండి కాపుల‌కు అన్యాయం జ‌రుగుతుంటే వాటిపై స్పందించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎక్క‌డ దాక్కున్నాడ‌ని ప్ర‌శ్నించారు.  వైపు కాపు ఉద్యమం తీవ్రమవుతుంటే తనకేమీ పట్టనట్లుగా పవన్ వ్యవహరిస్తున్నారని.. కాపులకు అండగా ఉంటానని చెప్పిన ఆయన ఇప్పుడు ఎక్కడ పడుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  పవన్ అప్పుడప్పుడు హీరోలా వచ్చి జీరోలా వెళుతున్నారని ఎద్దేవా చేశారు.

కాపుల కోసం ముద్రగడ పద్మనాభం దీక్ష చేసి ఆస్ప‌త్రిలో ఉన్నా ప‌వ‌న్ క‌నీసం ఒక్క మాట కూడా మాట్లాడ‌క‌పోవ‌డం బాధ‌క‌ర‌మ‌న్నారు. రాజ‌కీయాల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరో కాద‌ని.. ఆయ‌న జీరో అని ఇంకా చెప్పాల‌టే ప‌వ‌న్ ఓ జోక‌ర్ అని మండిప‌డ్డారు. అంతా అయ్యాక ప‌వ‌న్ వ‌చ్చి నీతులు చెబుతుంటే విన‌డానికి ప్ర‌జ‌లెవ‌రూ సిద్ధంగా లేని నారాయ‌ణ ఫైర్ అయ్యారు. కాగా నారాయ‌ణ చేసిన ఈ వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం పెను దుమారం రేపుతున్నాయి. కొంత‌మంది మాత్రం నారాయ‌ణ వ్యాఖ్య‌ల్లో వాస్త‌వం ఉంది క‌దా అని స‌మ‌ర్థిస్తుంటే ప‌వ‌న్ అభిమానులు మాత్రం నారాయ‌ణ వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →