Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Narendra Modi lost People’s Confidence: Janasena

By   /  April 13, 2018  /  Comments Off on Narendra Modi lost People’s Confidence: Janasena

    Print       Email

మోడీ న‌మ్మ‌కాన్ని కోల్పోయారు

InCorpTaxAct
Suvidha

 

 

 

 

* స‌భ జ‌ర‌గ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మే మోడీ

* ఒక‌రోజు దీక్ష ఎవ‌రిపై చేశారో చెప్పాలి?

* 16న జ‌రిగే రాష్ట్ర బంద్‌కు మ‌ద్ద‌తు ఇస్తున్నాం

* మోడీని ప్ర‌శ్నించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌

డెక్క‌న్ అబ్రాడ్‌:“ ప‌్ర‌ధాని న‌రేంద్ర మోడీ న‌మ్మ‌కాన్ని కోల్పోయారు. పార్ల‌మెంట్ సాక్షిగా ఇచ్చిన ప్ర‌త్యేక హోదా హామీని అమ‌లు చేయ‌కుండా ప్ర‌జ‌ల‌ను మోసం చేశారు. మొన్న జ‌రిగిన పార్ల‌మెంట్ స‌మావేశాల్లో సైతం చ‌ర్చ రానీయ‌కుండా అడ్డుకున్నారు. ఇప్పుడు ఒక రోజు దీక్ష చేశారు. ఈ దీక్ష ఎవ‌రి కోసం చేశారు. ఇలా చేస్తే ఎవ‌రు న‌మ్ముతారు“ అంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాని మోడీపై విమ‌ర్శలు గుప్పించారు. వామపక్షాల ఏపీ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, రామకృష్ణ  హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో పవన్‌తో భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా సాధనకు చేపట్టాల్సిన కార్యాచరణ, బీజేపీ దీక్ష తదితర అంశాలపై చర్చించారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానం విషయంలో ప్రధాని అనుసరించిన తీరుతో.. ఆయునకు పార్లమెంటరీ విధానాలపై ఏమాత్రం గౌరవం లేదని అర్థమవుతోంద‌న్నారు. అలాంటి మోదీ.. పార్లమెంటు సజావుగా సాగలేదంటూ చేసిన దీక్ష నమ్మశక్యంగా లేదని విమర్శించారు. సభ జరగకపోవడానికి కారకులే తాము బాధితులమంటూ దీక్షలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈనెల 16న ఏపీ రాష్ట్ర బంద్ నిర్వహించాలని ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపునివ్వడంతో.. ఆ బంద్‌కు మద్దతు ఇవ్వాలని జనసేన, సీపీఎం, సీపీఐ నిర్ణయించాయి.

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దీక్ష చేసినపుడు ఆయునను అపహాస్యం చేసినవాళ్లే ఇపుడు దీక్షలు చేస్తున్నారని పవన్ ప‌రోక్షంగా మోడీనుద్దేశించి అన్నారు. ప్రధాని బలమైన శక్తి అని గతంలో ప్రజలతో పాటు తానూ నమ్మానని, కానీ అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా చేసి ఆ నమ్మకాన్ని కోల్పోయారని చెప్పారు. దానిపై చర్చిస్తే వారి చిత్తశుద్ధితో పాటు టీడీపీ, వైసీపీలు చేసిన తప్పులూ తెలిసేవని అన్నారు. అందుకే మూడు పార్టీలు తీర్మానం చర్చకు రాకుండా చేశాయని.. ఇప్పుడు వాళ్లే ప్రదర్శనలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ, బీజేపీ, వైసీపీలను ప్రజలు నమ్మట్లేదని.. అందుకే ప్రజలకు బాధ్యతగా ఉండే రాజకీయాల కోసం మూడోశక్తి వస్తుందని చెప్పారు. ఇక 16వ తేదీ బంద్ దృష్ట్యా ఈ నెల 15న అనంతపురం, 24న ఒంగోలు, మే 6న విజయనగరంలో తలపెట్టిన కార్యక్రమాల్ని వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

NATA Women’s day celebrations: Washington DC

Read More →