Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Narendra Modi’s definition of TOP (Tomato, Onion, Potato) performance

By   /  February 5, 2018  /  No Comments

    Print       Email

టాప్ కి కొత్త అర్ధం చెప్పిన ప్రధాని మోదీ..!

 

InCorpTaxAct
Suvidha

భారత ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్‌లో జరిగిన బీజేపీ పరివర్తన్ ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టాప్ (TOP) అర్థానికి కొత్త నిర్వచనం చెప్పారు. తమ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంస్కరణలు చేపట్టిందని.. రైతు అభివృద్ది కోసం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. ఇక టాప్ అంటే..టీ అంటే టొమాటో, ఓ అంటే ఆనియన్స్(ఉల్లిపాయలు), పీ అంటే పొటాటో(బంగాళదుంపలు).. అంటూ తనదైన శైలిలో నిర్వచనం ఇచ్చారు.

రైతు దేశానికి వెన్నుముఖ వంటి వారని.. అందుకే రైతు అభివృద్ది కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. గత ప్రభుత్వాలు రైతులను ఆదుకోలేదని.. యూరియా కోసం రైతులు లాఠీ దెబ్బలు తినేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడేవారన్నారు. మద్దతు ధర లేక నానా కష్టాలు పడ్డారన్నారు. రైతులకు మద్దతు ధర ప్రకటించామని, కొత్త పథకాన్ని తీసుకొస్తున్నామన్నారు. ఈ పథకంతో కర్నాటక రైతులకే పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుందన్నారు. రైతుల జీవితంలో మార్పు తీసుకొస్తామన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →