Loading...
You are here:  Home  >  Community Events  >  Awareness  >  Current Article

NATA Atlanta Tribute to Gollapudi

By   /  December 16, 2019  /  No Comments

    Print       Email

అట్లాంటాలో గొల్లపూడిగారిని స్మరించుకున్న నాటా (NATA)…  

ప్రముఖ సాహితీవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి కీర్తిశేషులు గొల్లపూడి మారుతి రావుగారి సంస్మరణ సభ అట్లాంటా లోని  జాన్స్ క్రీక్ నగరంలో గల ఎ.బి.సి. ఫంక్షన్ హాల్ లో, సాయంత్రం 3 గంటల నుండి 6 గంటల వరకు జరిగింది. అమెరికాలోని ప్రముఖ తెలుగు సంస్థ నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) వారు బాల ఇందుర్తిగారి సారధ్యంలో, ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ తెలుగు సంస్థలకు చెందిన ప్రతినిధులు, పాత్రికేయులు, తెలుగు భాషాభిమానులు ఈ సభకు హాజరయ్యారు. 

InCorpTaxAct
Suvidha

మైత్రి సంస్థ ను నడుపుతున్న విజు చిలువేరు, ఫణి డొక్కా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజు చిలువేరు కార్యక్రమ వివరాలు తెలిపారు. తరువాత గొల్లపూడి వారి ఆత్మశాంతికై, వచ్చిన వారందరూ రెండునిముషాలు మౌనం పాటించారు. పిమ్మట నాటా సంస్థ ప్రతినిధులు, సభకు వచ్చినవారు గొల్లపూడి వారికి పుష్పాంజలులు సమర్పించారు. ఫణి డొక్కా గొల్లపూడివారితో తన అనుభవాలను పంచుకున్నారు. అనంతరం, భారతదేశం నుంచి వచ్చిన కవి, బహుభాషాకోవిదుడు, రాజనీతి శాస్త్రాధ్యాపకులు జలజం సత్యనారాయణ గారు మాట్లాడారు. తరువాత  బాల ఇందుర్తి గారు, నరేంద్ర రెడ్డి గారు, లావు అంజయ్య చౌదరిగారు, కోదండరామి రెడ్డి గారు, గౌతం గోలిగారు, రవి పోణంగి గారు, రాం దూర్వాసుల గారు, వెంకట్ చెన్నుభొట్ల గారు, దేవి దాడితోటగారు, వెంకట్ మొండెద్దు గారు మాట్లాడారు. ప్రమోద్ సంగ్వార్ గారు చక్కని భజన ఆలపించారు. కడియాల ప్రభాకర్ గారు ధూర్జటి మహాకవి విరచితమైన కాళహస్తీశ్వర శతకము నుంచి ఒక పద్యాన్ని ఆలపించారు. మారుతిరావుగారి చిత్రపటాన్ని, పూలమాలలను అందించిన రాజేష్ తడికిమళ్ళ గారికి విజు చిలువేరు గారు కృతజ్ఞతలు తెలిపారు. 

నాటా సంస్థ అట్లాంటా తరపున శ్రీనివాస్ కొట్లూరి (ED ), వెంకట్ మొండెద్దు (SC) ), భూపాల్ రెడ్డి పాంగ (RVP) కోదండ దేవరపల్లి (RVP) నీలిమ గడ్డమనగు (RVP) ఇంకా పుష్యమి గొట్టిపాటి (RC) పాల్గొన్నారు.  

మారుతి రావుగారి రచనలపై ఒక ప్రత్యేక సాహితీ సదస్సు చేస్తే బాగుంటుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. మంచి కార్యక్రమాలకు తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని వివిధ సంస్థల నేతలు తెలిపారు. కోదండరామి రెడ్డి గారు తన ప్రసంగంలో, మారుతి రావు గారి రెండు డైలాగులను తన గళంలో అనుకరించి అందరినీ అలరించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మారుతిరావుగారిని పలుమార్లు అమెరికాలోనూ, భారతదేశంలోనూ సన్మానించుకునే అదృష్టం కలిగిందని బాల ఇందుర్తి చెప్పారు. వారితో వ్యక్తిగతంగా తనకున్న పరిచయాన్ని స్మరించుకున్నారు. సుమారు 50 మంది సాహితీ ప్రియులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నాటా సంస్థ ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన విజు గారికి, ఫణి గారికి కృతజ్ఞతలు తెలిపారు.

-ఫణి డొక్క

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →