Loading...
You are here:  Home  >  Community Events  >  Awareness  >  Current Article

NATA Convention Philadelphia 2018 – July 6 – 8, 2018

By   /  April 11, 2018  /  No Comments

    Print       Email
మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించి, భద్రంగా భావితరాలకు అందించడం ముఖ్యోద్దేశ్య౦గా ఆవిర్భవించిందే మన ‘నాటా’. తెలుగుజాతి సాహిత్య, సాంస్కృతిక, సా౦ఘిక, మత, ఆరోగ్య, ఆర్ధికపరమైన అంశాలను, మరియు మన తెలుగు సమాజాన్ని, అటు ఇండియాలోనూ, అమెరికాలోనూ, ప్రభావితం చేయడానికి గత 7  ఏళ్ళుగా మన సంస్థ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే, అనేక ప్రదేశాలలో కళాశాలలు, గ్రంధాలయాలు, వైద్య సౌకర్యాలు, వైద్య శిబిరాలు, మంచి నీటి కార్యక్రమాలు, సోలార్ దీపాలు నిర్మించడం జరిగింది. అంతేకాకుండా అర్హులైన యువతీ యువకులకు, ‘స్కాలర్ షిప్స్’ అందజేయడం, యువతకు ఉన్నత విద్యకు అవసరమైన వనరులు చేకూర్చడంలోనూ కూడా దోహదం చేసింది. 
 
గత 22 ఏళ్ళుగా సాంకేతిక సమాచార, రంగాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పుల వలన మనం ఎప్పటికప్పుడు భారతదేశంలోని మన సంస్కృతిని పరస్పరం అందిపుచ్చుకునే అవకాశం లభించింది. అయితే ఇప్పుడు మన సంస్కృతిని పరిరక్షించుకుంటూ, మన సామాజిక అవసరాల మీద దృష్టి సారించవలసిన అవసరం ఏర్పడింది. అందుకే సంస్కృతి, సంప్రదాయం, సమాజసేవే ప్రాధాన్యాతగా కృషి చేస్తున్నాము. ఆ ప్రయత్నంలో భాగంగానే రెండేళ్ళకోసారి ‘నాటా’ ఉత్సావాల్ని ఘనంగా నిర్వహిస్తున్నాం! ఈ సమావేశాలు ముఖ్యంగా యువతని ప్రభావితం చేసేందుకు, అణగారిపోతున్న, అగాధాల వైపు సాగిపోతున్న మన అనుబంధాలను సుగంధభరితం చేసేందుకు పరస్పరం కలుసుకుని, హృదయాలు విప్పి మాట్లాడుకునేందుకు నిర్దేశించబడినాయి. మనం మన దృష్టిని ముఖ్యంగా భావి తరాల ప్రతినిధులైన యువత భవిత కోసం యోచించాల్సిన సమయం ఇది. అందుకోసం ఈ ‘నాటా’ వేదికపై  అనేక సెమినార్లను ఏర్పాటు చేశాం. ఈ సమావేశాల ద్వారా మన జీవన సంవిధానం, కష్టసుఖాలు, అనుభవాలు ఇండియాలోని మన వారందరూ మరింత క్షుణ్ణంగా తెలుసుకుని మనతో సంబ౦ధ బా౦ధవ్యాలు మరింత మెరుగుపరచుకునే అవకాశం ఉంటుంది. ఈ  కార్యక్రమాల ద్వారా ఈ అవకాశాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాము. కావున తామెల్లరు నాటా ఫిలడెల్ఫియా 2018 తెలుగు మహా సభలకు విచ్చేసి వీటిని దిగ్విజయం చేయగలరని అసిస్తునాము. నాటా కవులు, కళాకారులు, రాజకీయ ప్రముఖులు, యువతీ యువకులు అందరిని పేరు పేరున ఆహ్వానిస్తుంది. కావున తామెల్లరు కదిలి వచ్చి నాటా మహాసభలను దిగ్విజయం చేయగలరని మరొకసారి ఆశిస్తూ …
 

NATA IDOL – Singing Competition

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

TDF Atlanta Bathukamma & Dasara Sambaralu-2018

Read More →