72 గంటల పాటు తెలుగుదనంతో డాలస్, టెక్సస్ మహానగరాన్ని తన చీర కొంగున దాచి ఒక అద్భుతమైన ప్రపంచాన్నిఆవిష్కరించి అలరించిన పండుగ నాటా మహా సభలు. వాహ్ గ్రేట్.. తెలుగు మాట, పాట, ఆట, విందు భోజనంతో డాలస్ డౌన్‌టౌన్ మూడు రోజులపాటు ప్రేక్షకపాత్ర పోషించింది. ఒక మైలుదూరం పాటు ఏర్పాటైన డాలస్ మహా సభల కు నగరంలోనిప్రజలు, పోలీసులు ఆశ్చర్యంగా ఈ వేడుకలకు అతిథులయ్యారు. డాలస్ నగరంలో ఓమ్ని హోటెల్ తో అనుబంధంగావిస్తరించిన కన్వెన్షన్ సెంటర్లో మే 27, 28, 29 తేదిలలో జరిగిన నాటా మహా సభల గురించి నిజంగా చెప్పడానికి మాటలుచాలవనే చెప్పాలి. ఎటు చూసినా తెలుగు రాష్ట్రాల ప్రజలు, భాషలు, నవ్వులు, పువ్వులు, కబుర్లతో పండుగనుమైమరపించింది. Photo Gallery: https://goo.gl/94iZbw
చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరి గుండెల్లో కొత్త జీవనోత్సాహాన్ని నింపిన నాటాకు మహా సభల ముగింపు క్షణాలు అద్భుతం..నాటా మహాద్భుతం..థాంక్యూ అంటూ కృతజ్ఞతలతో ప్రేక్షకులు నాటా మహానాయకులు, పోషకులు డాక్టర్ ప్రేమ్‌సాగర్ రెడ్డికి, నాటా అధ్యక్షులు డాక్టర్ మోహన్ మల్లం, అడ్వైజరు ఎ వి ఎన్ రెడ్డి, డాక్టర్ ఆదిశేషారెడ్డి, డాక్టర్ స్టాన్లీ రెడ్డి,జితేందర్ రెడ్డి, కన్వీనర్ గూడూరు రమణారెడ్డి, కన్వెన్షన్ కో ఆర్డినేటర్ రామసూర్యారెడ్డి, మాజీ అధ్యక్షులు సంజీవ రెడ్డికి, నాటాఎలెక్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజేశ్వర్ గంగసానికి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గోశాలరాఘవరెడ్డికి, సెక్రటరీ గిరీష్ రామిరెడ్డికి,ట్రెజరర్ హరికి, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ గానగోని, మల్లిక్ బండ, ఇండియా కో ఆర్డినేటర్ డాక్టర్ ద్వారకనాధరెడ్డి,ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జయచంద్రారెడ్డికి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆళ్ళరామిరెడ్డికి, కన్వెన్షన్ అడ్వైజర్ ప్రదీప్ సామలకి,శ్రీధర్ కొర్సపాటి, ఫల్గుణ్ రెడ్డి, నాగిరెడ్డి దర్గా రెడ్డి, సురేష్ మండువ, గీత దమ్మన, వెంకట్ వడ్డాడి, శేఖర్ కోనాల, మోహన్కలాడి, తలపులపల్లి చిన్నబాబురెడ్డి తదితరులకి చేతులు జోడించారు.
వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన వాళ్ళు, అమెరికా సంయుక్త రాష్ట్రాలనుంచి కుటుంబాలతో కదలి వచ్చినవాళ్ళుఉన్నారు. నాటా సాయంతో ఒడిదుడుకుల నుంచి జీవితాలను భద్రంగా నిలబెట్టుకున్నవాళ్ళు, చదువుకుంటున్నవాళ్ళు,పరిశుభ్రమైన తాగునీటితో ఆరోగ్యాలను కాపాడుకుంటున్నవాళ్ళు, సోలార్ లైట్లు, మరుగుదొడ్లతో సాయం పొందినవాళ్ళుటివిలలో నాటా కార్యక్రమాలను వీక్షిస్తూ నమస్కరించారు. నెల రోజులపాటు అమెరికాలోని ప్రధాన నగరాల్లో నిర్వహించిన కొత్తతరం తెలుగు గాయకుల అన్వేషణా కార్యక్రమం నాటా ఐడల్. ఈ కార్యక్రమాన్ని నాటా బ్రాండ్ అంబాసిడర్ చంద్రబోస్,సంగీత దర్శకులు రఘు కుంచె, సెక్రటరీ గిరీష్ రామిరెడ్డిలు తమ భుజస్కందాలపై వేసుకుని ఎంతో శ్రమతో కార్యక్రమాన్నివిజయవంతంగా నిర్వహించి నాటాకు మరింత కీర్తిని అందించారు.
ముఖ్యంగా నాటా వేదిక మీద వివిధ రంగాల్లో విశేష సేవలందించిన అనేక మందిని నాటా అవార్డులతో సత్కరించి మరింతమంది తెలుగువారికి స్ఫూర్తిని నింపింది. సుధాకర్ రామకృష్ణ(వ్యాపారం), ఆరాధ్యుల కోటేశ్వరరావు, వినయిని జయసింఘే(కల్చరల్), తుర్లపాటి ప్రసాద్(సాహిత్యం),మాంచు ఫర్రర్, ఆర్ కె పండిటి( కమ్యూనిటీ సర్వీస్), చంద్రుపట్ల తిరుపతిరెడ్డి(ఇంజనీరింగ్), జిబికె మూర్తి(జర్నలిజం, పబ్లిక్ రిలేషన్స్), డాక్టర్ కాంతారెడ్డి, డాక్టర్ జగన్ కాకరాల(మెడిసిన్), వేల్కూరి శ్రీహరిసంజీవి( పబ్లిక్ సర్వీస్), కెఆర్ కె రెడ్డి, పోచ బ్రహ్మానందరెడ్డి(రీసెర్చ్), ప్రణతి శర్మ గంగరాజు, తీగల సాహిత్ రెడ్డి(యూత్) లకుఅవార్డులను బహుకరించింది.
నాటా లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డును ప్రఖ్యాత సినిమా దర్శకులు ఎ. కోదండరామిరెడ్డికి అందించింది. సినీ నటులు,రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, సాహితీవేత్తలు, కవులు, నాటకరంగ కళాకారులు, ఆధ్యాత్మికగురువులు, పత్రికా సంపాదకులు హాజరై నాటా తెలుగుదనానికి మరింత సొబగులు అద్ది తెలుగు పరిమళాలనుప్రపంచమంతా వెదజల్లారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు తన ఆటాపాటలతో వినోదాన్ని అందించే నటీమణులు రకుల్‌ప్రీత్, ప్రణీత, నిత్యామీనన్, హీరోలు సుదీర్ బాబు, వరుణ్ తేజ్ లు అలరించారు. రాజకీయ ప్రముఖులు వైఎస్ఆర్ సిపినాయకులు, పార్లమెంట్ సభ్యులు పివి మిథున్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, డికె అరుణ, ఎమ్మెల్యే సంపత్ కుమార్, బుడ్డా రాజశేఖర్‌రెడ్డిలు హాజరై తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు వేదిక గానిలిచారు.
పత్రికా సంపాదకులు, సీనియర్ పాత్రికేయులు కె. రామచంద్రమూర్తి, దేవులపల్లి అమర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నాటానిర్వహించిన ఫోర్త్ ఎస్టేట్ సదస్సుకు విచ్చేసి తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుత రాజకీయ, సామజిక పరిణామాలను, పార్టీలపోకడలను వివరించారు. నరాల రామిరెడ్డి, అఫ్సర్ ల ఆధ్వర్యంలో నాటా తెలుగు సాహితీసభ విజయయవంతమైంది. ఇకఅమెరికా లోని అలుమ్ని అసోసియేషన్ల కలయికలు సభకు విచ్చేసిన వారందరికి కొత్త ఉత్సాహాన్ని నింపాయి. విధ్యర్తికాలంనాటి జ్ఞాపకాలు, కబుర్లు, ముచ్చట్లు, కెరీర్ల గొడవలతో సరదా సరదాగా జరిగాయి. వీటిల్లో ముఖ్యంగా ఎన్ బి కె ఆర్ ఐఎస్ టి,ఎపిఎంజి యుఎస్ఎ, కర్నూలు మెడికల్ కాలేజీ, రంగరాయ మెడికల్ కాలేజీ, ఉస్మానియా యూనివర్సిటీ, సిబిఐటి, ఎస్వీయూనివర్సిటీ.
నాట గ్రాండు ఫినాలేలొ బాగంగ ప్రదర్శించిన తెలుగుజాతి మనది పాటకు మంచి స్పందన లభించినది. ఈ పాట అనంతరము డాక్టర్ ప్రేమ్‌సాగర్ రెడ్డి గారి సందేశానికి ప్రేక్శకులు తమ కరతాళ ద్వనులతో సంతోశాన్ని వ్యక్తం చేసారు. వివరాలకు క్రింద వీడియో లింకు చూడండి
…
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.