Loading...
You are here:  Home  >  Community Events  >  Awareness  >  Current Article

NATA – University of Farmington Students

By   /  February 2, 2019  /  No Comments

    Print       Email

న్యూజెర్సీ: నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) ఫార్మింగ్టన్ విశ్వవిద్యాలయం లో చేరి బాధితులు అయిన విద్యార్థులు అనేక మంది తో మాట్లాడి వారికి ఆసరా గా వుంది. అమెరికా లో అనేక మంది విద్యార్థులు ఫార్మింగ్టన్ విశ్వవిద్యాలయం లో చేరి బాధితులు అయినారు. అందులో మెజారిటీ తెలుగు విద్యార్థులే వున్నారు. అది అర్హత లేని విశ్వవిద్యాలం అని తెలియక వీరిలో ఎక్కువమంది తమ వర్క్ పర్మిట్ పొందడానికి ఈ విశ్వవిద్యాలయం లో చేరారు.వారందరి కలలు పటాపంచలైనాయి.

   బాధితులు అయిన అనేకమంది విద్యార్ధులు నాటా నాయకులకు తమకు జరిగిన పరిస్థితిని వెంటనే ఫోన్ చేసి వివరించారు. తెలిసిన వెంటనే నాటా నాయకులు న్యాయవాదులతో మాట్లాడి విద్యార్థులతో కాన్ఫరెన్స్ కాల్ నిర్వహించింది. ఇమ్మిగ్రేషన్ లాయర్లు విజయ్ యెల్లారెడ్డిగారి, సంతోష్ రెడ్డి సోమిరెడ్డి మరియు యాయా తిబిట్  విద్యార్థులతో మాట్లాడి మరియు వారి హక్కుల గురించి వివరించారు. అంతే కాకుండా ఇలాంటి విశ్వవిద్యాలయం బాధితులు కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు. ఈ  ఫార్మింగ్టన్ విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఉచితం గా న్యాయ సలహాలను లాయర్లు విజయ్ యెల్లారెడ్డిగారి, సంతోష్ రెడ్డి సోమిరెడ్డి ధ్వారా నాటా వారు ఉచితం గా అందిస్తున్నారు.

InCorpTaxAct
Suvidha

తల్లిదండ్రులకు మేము తెలియచేసేది ఏమంటే అరెస్ట్ అయిన వారినందరినీ విచారించి పంపిస్తారు. తల్లిదండ్రులు భయపడ వలసిన అవసరం లేదు. అరెస్ట్ అయిన విద్యార్థులందరూ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ శాఖ నిర్బంధంలో వున్నా కూడా వారిని బాగానే చూస్తారు. వారికి ఏవిధమైన హాని తలపెట్టరు.  అమెరికాలోని వివిధ ప్రాంతాల నాటా నాయకులు విద్యార్థులను కలసి వారిని ఓదార్చు చున్నారు.

ఎవరైనా  అరెస్ట్ అయిన వారి వివరాలు తెలుసుకోవాలంటే https://locator.ice.gov/ వెబ్ సైట్ కు వెళ్లి తెలుసుకోవచ్చు. ఇండియన్  ఎంబసీ వారికి ఫోన్ [ (202) 322-1190, (202) 340-2590] చేసి మాట్లాడి విద్యార్థుల వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే వివరాల కొరకు  cons3.washington@mea.gov.in కి ఇమెయిల్ చేయవచ్చు.

మేము ఇతర విద్యార్థులకు తెలియ చేసేది ఏమంటే ఇలాంటి ఉచ్చులు లోకి పడకుండా మరియు కష్టపడి చదువుకొని అన్ని రూల్స్ పాటించి ప్రముఖ విశ్వవిద్యాలయాల నుండి OPT / CPT పొందడం కోసం కృషి చేయమని మా సలహాలు సూచనలు ఇస్తున్నాము. ఏ విశ్వవిద్యాలయైనా ఏ విధమైన కోర్సు లేకుండా CPT ని అందిస్తున్నట్లయితే అలాంటి విశ్వవిద్యాలయాల ను నమ్మవద్దు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Tribute to Ghantasala

Read More →