Loading...
You are here:  Home  >  Community Events  >  Awareness  >  Current Article

వీనుల విందుగా డల్లాస్ లో  “నాటా ఐడల్” కిక్ ఆఫ్ ఏప్రిల్ 29, 2016

By   /  May 3, 2016  /  No Comments

    Print       Email

nata

వసంత కోకిలలు అన్ని ఒక్క చోట చేరి సంగీత విభావరి జరిపితే ఎంత హాయిగా ఉంటుందో , డల్లాస్ లో  జరిగిన నాటా ఐడల్ కార్యక్రమం కూడా అంతే  హాయిగా జరిగింది.   మే 27 నుండి 29 వరకు జరగబోయే  నాటా మహాసభల ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఉత్తర అమెరికా అంతటా జరుగుతున్న సంగీత సమ్మేళనం ” నాటా ఐడల్ ” డల్లాస్ ప్రజలను ముగ్ధ మనోహర సంగీత రసఝరిలో తేలియాడించిది.  అమెరికాలో పది పది నగరాలలో జరుగుతున్న ఈ నాటా ఐడల్  కార్యక్రమం డల్లాస్ ఫ్రిస్కో కమ్యూనిటీ సెంటర్ లో శుక్రవారం ఏప్రిల్ 29న జరిగింది.   ప్రతి నాటా ఐడల్ కార్యక్రమం నుండి  ఉత్తమ గాయనీ గాయకులను ఎంపిక చేసి , మే 28న డల్లాస్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగే  నాటా తెలుగు  మహాసభలలో సెమిఫైనల్స్ నిర్వహిస్తారు.  వారినుండి 8 మందిని ఎంపిక చేసి వారిని మే 29 వ తేదిన అక్కడే జరిగే ఫైనల్స్ లో పాడే అవకాశం కల్పిస్తారు. ఫైనల్స్ లో విజేతలను  రఘు కుంచె గారి సంగీత దర్శకత్వంలో సినీ ప్రపంచానికి గాయనీ గాయకులుగా పరిచయం చేస్తారు.

InCorpTaxAct
Suvidha

13131331_1016158255138338_6899683650694198837_oముందుగా ఈ కార్యక్రమాన్ని డా. నాగిరెడ్డి దర్గారెడ్డి రీజనల్ వైస్ ప్రెసిడెంట్  నాటా ఐడల్ న్యాయ నిర్ణేతలు చంద్ర బోస్ గారికి,రఘు కుంచె గారికి, గాయనీ గాయకులకు, ప్రేక్షకులకి స్వాగతము పలికారు. నాటా సెక్రటరీ మరియు నాటా ఐడల్ చైర్ గిరీష్ రామిరెడ్డి దాదాపుగా మూడు వందల పైగా గాయనీ గాయకులు పాటలో పోటిలో పాల్గొనడానికి  ఉత్సహాన్ని కనబరిచారు అని సభకి తెలియచేసారు. శారదా సింగిరెడ్డి నాటా డల్లాస్ కోఆర్డినేటర్ చంద్ర బోస్ గారిని, రఘు కుంచె గారిని పరిచయము చేస్తూ వేదిక పైకి ఆహ్వానించగా నాటా ఐడల్ టీం మరియు నాటా కార్య వర్గ బృందం పుష్పగుచ్చముతో సత్కరించారు.

అయిదు వందల మంది విచ్చేసిన ఈ మొదటి నాటా ఐడల్ కార్యక్రమం, డల్లాస్ లో సువిశాల ప్రాంగణంలో, చక్కని వాతావరణంలో జరిగింది.  ఈ కార్యక్రమానికి  చంద్రబోసు గారు , రఘు కుంచె గారు న్యాయ నిర్ణేతలు గా వ్యవహరించారు. చంద్రబోసు గారు మాట్లాడుతూ “అమెరికా తెలుగు పిల్లలు తెలుగులో మాట్లాడడం కొంచెం కష్టమైన పనే, దైనందిక జీవితంలో అన్నీ ఆంగ్లం తో ముడిపడిఉన్నా పాటలు పాడే విషయంలో ఒక్క అక్షర దోషం కూడా లేకుండా పాడారు” అని ప్రసంసించారు . ఈ పాటల వేడుకలో  21 మంది చిన్నారులు పెద్దలు పోటీ  పడ్డారు. శాస్త్రీయ సంగీత మాధుర్యం , నవ సినీగీతాల సౌరభ్యాల నడుమ  వీనులవిందైన సంగీతవిభావరి ప్రేక్షకులను ఎంతో అలరించింది.  ఈకార్యక్రమానికి టి.వి5 యాంకర్  పద్మశ్రీ తోట వ్యాఖ్యాతగా వ్యవహరించారు.  పోటీదారులు పాడిన ప్రతిపాటకు అందులో ఉండే సాహిత్య పరిమళాలను చంద్రబోస్ గారు చక్కగా విశ్లేషించగా , రఘు కుంచె గారు సంగీత గమకాలు, బాణీలో మలుపులు, స్వరాల గమ్మత్తులు వివరించారు. ఈవిధమైన విశ్లేషణను గాయనీ గాయకులు ఎంతో ఆస్వాదించారు. వారికి తెలియని ఎన్నో కొత్తవిషయాలు తెలుసుకొనే అవకాశం కలిగినందుకు కృతజ్ఞతలు తెలిపారు.  జానకి, చిత్ర గారే దిగివచ్చారా అన్నట్లు  అమెరికా అమ్మాయలు పాడిన పాటలకు కరతాళ ధ్వనులు మిన్నంటాయి.  చంద్రబోస్ గారు ” అమరికా తెల్ల కోకిల “,  “నీ గళం అనే కలంతో నీ భవిష్యత్తు నువ్వే రాసుకొంటావు”,  ఈనాటి  నాటా ఐడల్ గాయకులే “నేటి”  సినీ గాయకులు ” అని అత్యద్భుతమైన కామెంట్స్ ఇచ్చారు. పోటా పోటీగా జరిగిన ఈ పోటీలో ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠతో ఫలితాలకోసం అందరూ  ఉత్తరఅమెరికా తెలుగువాళ్ళే కాదు, తెలుగురాష్ట్రాల ప్రజలుకూడా ఎంతోఆసక్తితో  ఎదురుచూస్తున్నారు. మొదటి పోటీలో పాల్గొన్న ప్రతిఒక్క గాయనీగాయకులకు నాటా అధ్యక్షులు డా.మోహన్ మల్లం గారు మరియు న్యాయనిర్ణేతలు జ్ఞాపికలు అందించారు. అధ్యక్షులు  డా.మోహన్ మల్లం గారు డల్లాస్ కన్వెన్షన్ ఎంతో వైభవంగా జరగబోతోంది , ఇది తెలుగువారి పండుగ , మనందరం విచ్చేసి ఈకార్యక్రమాన్ని జయప్రదంచేయాలి అని విన్నవించారు.

 

కన్వెన్షన్ కన్వీనర్ డా. రమణా రెడ్డి గూడూరు, ప్రెసిడెంట్ ఎలెక్ట్ రాజేశ్వర్ రెడ్డి గంగసాని. కన్వెన్షన్ కోఆర్దినటర్ రామసూర్య రెడ్డి, బోర్డు ఆఫ్ డైరెక్టర్ డా.రామి రెడ్డి బుచ్చిపూడి, ఎక్స్ క్యూటివ్ కమిటి జయచంద్రా రెడ్డి, నేషనల్ కన్వెన్షన్ అడ్వైసర్ ప్రదీప్ సమాల, కన్వెన్షన్ కోకన్వీనర్ డా.శ్రీధర్ రెడ్డి కొరసపాటి, డిప్యూటి కన్వీనర్ ఫల్గుణ్, కోఅర్దినేటర్ సురేష్ మండువ, డిప్యూటి కోఆర్డినేటర్  గీత  దమన్న శాలువాతో న్యాయ నిర్ణేతలను ఘనంగా సత్కరించారు. రీజనల్ కోఆర్దినేటర్స్,కల్చరల్ కార్యవర్గ బృందం మాధవి సుంకిరెడ్డి, కమలాకర్ పూనూరు, రేఖ కరణం,శాంత సుసర్ల,ఇంద్రాణి పంచార్పుల,జయ తెలకలపల్లి, రాజేంద్ర పోలు , చంద్రజల సూత్రం, చెన్న కొర్వి, నంద కొర్వి,బాల గణపర్తి, వెంకట్ ములుకుట్ల, సుప్రియ టంగుటూరి,సతీష్ శ్రీరాం,నగేష్  దిన్డుకుర్తి మరియు కళ్యాణి తాడిమేటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

డా. నాగిరెడ్డి దర్గారెడ్డి ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన టీవీ5, దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ9, సీవీఆర్ టీవీ, యువ,టోరి, రేడియోమస్తి, చక్కని విందుని సమకూర్చిన హిల్టాప్ యాజమాన్యానికి కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు.

 

Photo album link: https://drive.google.com/folderview?id=0B1vU88ddnasVZEUtRVlIOU1oOVU&usp=sharing

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →