Loading...
You are here:  Home  >  Community Events  >  Awareness  >  Current Article

NATA Women’s day celebrations: Washington DC

By   /  March 24, 2019  /  No Comments

    Print       Email

నాటా వాషింగ్టన్ డిసి మెట్రో విభాగ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు !

 

InCorpTaxAct
Suvidha

 

నాటా బోర్డ్ అఫ్ డైరెక్టర్ సుధారాణి కొండపు  ఆధ్వర్యంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆష్బర్న్ , వర్జీనియాలో నిర్వహించిన  అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
రమారమి 500 మందిమహిళలతో కళకళలాడుతూ ఎంతో ఘనంగా జరిగాయిప్రియ గారి ప్రార్థనా గీతంతో మొదలైన ఈ కార్యక్రమం కూచిపూడి డాన్స్ అకాడమీనుంచి  ట్రినిటీ పంత్ ప్రదర్శించిన గణేష పంచరత్నం , మాధవీ మైలవరపుగారి బృందం ఆలపించిన అష్టలక్ష్మి స్తోత్రంతో పాటు
మహిళాసంబంధమైన పాటలను సుధ , శ్రీలత, లలిత గారు ఆలపించగా శ్రావ్యమైన పాటలు వినడం ద్వారా మానసికోల్లాసము పెంపొందించుకోవడంపై లలితా రాంపల్లి వివరంగా తెలియజేసారు. ఇంద్రాణి దావలూరి ప్రదర్శించిన మహిషాసురమర్థని ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

డి సి మెట్రో విభాగంలోని వివిధ రంగాలకు చెందిన స్ఫూర్తిదాయకమయిన మహిళలను గుర్తించి వారికి “నాటామహిళ “ పురస్కారాలను అందచేయటం జరిగింది.
కూచిపూడి కళారంగంలో సేవలందిస్తున్న లక్ష్మిబాబు గారికి , ఆరోగ్యరంగం నుంచి శ్రీలేఖ పల్లె గారికి , మన తెలుగుమహిళల్లో అరుదుగా ఎంచుకునేరంగం నుంచి న్యాయవాది జనెత కంచర్లగారికి ,
IT రంగంలోనే కాక అనేక రంగాలలో ప్రత్యేక గుర్తింపు పొందిన పద్మిని నిడుమోలు గారిని
ఈ సందర్భంగా గుర్తించడం జరిగింది .చైతన్య తుల అడిగే  గొప్ప గొప్ప మహిళలకు సంబంధించిన ప్రశ్నలతో ,  జయ తెలికుంట్ల మరియు రాధిక జయంతిల వ్యాఖ్యానంతో సరదా సరదా ఆటలతో మరియు విలువైన రేఫిల్స్ తో స్పాన్సర్ల గిఫ్ట్ లతో ,vendor stallsతో , తత్వ వారి రుచికరమైన వంటకాలతో ఆహూతులను 3గంటల సేపు ఆకట్టుకున్నారు.
వసుధారారెడ్డి మహిళా సాధికారత మరియు మహిళల గొప్పతనం గురించి ఈ సమావేశం లో కొనియాడారు.
NATA కల్చరల్ కమిటీ ఛైర్ విజయ దొండేటి, సంధ్య బైరెడ్డిలు ,చిత్ర దాసరి, ప్రత్యేక అతిథులను ఆహ్వానించగా చైతన్య , స్వరూప గిండి, అనిత ,లావణ్య ,గౌరి మరియు ఇతర సభ్యులు ఈ వేడుకలని విజయవంతం చేసారు.
ఈ కార్యక్రమంలో సెనేటర్ జెన్నిఫర్ బయోస్కొ, కౌంటిఛైర్ ఫిలిస్ రేండల్, జాన్ బెల్          పాల్గొన్నారు.
TANA , American Telugu association , American Telangana association,TDF , GWTCS , CATS నాయకులు పాల్గొని తమ అభినందనలు తెలియజేసారు.

నాటా ప్రెసిడెంట్ రాఘవరెడ్డి గారు   మాట్లాడుతూ నాటాలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉంటుందనీ,   ఇంటాబయటా అన్ని రంగాలలోనూ ముందంజ వేస్తున్న మహిళలు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

మన తెలుగు ఆడపడుచులు వివిధ బ్యూటీ కాంటెస్ట్ లలో గెలుపొందిన ఇంద్రాణి , సురేఖ మరియు హిమాన్విలను ప్రత్యేకంగా అభినందించారు. చివరగా సంధ్య
బైరెడ్డి అక్కడికక్కడే ఉత్సాహవంతులయిన 30 మంది మహిళలతో చేసిన ఫాషన్  వాక్  ప్రత్యేకత సంతరించుకుంది.
ముగ్గురు మహిళామణులందించిన(Dazzling stars ) Photo booth decoration, మరియు శ్రీలక్ష్మి మహిళా డి .జె .ఈ కార్యక్రమానికి ప్రత్యేకతలు.

కార్యక్రమాలతో  నిర్వాహుకులు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సతీష్ నరాల , మోహన్ కలాడి, బాబూరావు సామల , కిరణ్ గున్నం, నాటా వాషింగ్టన్ డిసి ప్రాంతీయ సభ్యులు
మధు మోటాటి, ఆంజనేయరెడ్డి దొండేటి, నినాద్ అన్నవరం, ఉదయ ఇంటూరు, వెంకట్ కొండపోలు , సుజిత్ మారం, రమేష్ వల్లూరి పాల్గొని తన సహాయసహకారాలు అందించారు.
చివరగా బోర్డ్ ఆఫ్ డైరక్టర్ శ్రీమతి సుధారాణి నాటాఅధ్యక్షులు రాఘవరెడ్డి గారికి మరియు ఇతర నాటా కార్యవర్గ సభ్యులకు , మీడియా మిత్రులకు , స్పాన్సర్లకు,  విచ్చేసిన అతిథులకు , ఆహూతులకు , ఇతర సోదర సంస్థల ప్రతినిధులకు ,ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.

https://https://drive.google.com/drive/folders/1-3ZZueZXL0-O7MSA8jGVFgQsZ39gus64drive.google.com/drive/folders/1-3ZZueZXL0-O7MSA8jGVFgQsZ39gus64

 

Sudha Rani kondapu ,
Board of Director, NATA.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →