Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Nathu Singh: Factory worker’s son who netted Rs 3.2 crore in IPL auction

By   /  February 7, 2016  /  Comments Off on Nathu Singh: Factory worker’s son who netted Rs 3.2 crore in IPL auction

    Print       Email

nathu singh

ధనవంతుడిగా మారిన క్రికెటర్ నాథూ సింగ్..

InCorpTaxAct
Suvidha

ఐపీఎల్ వేలం జరగగానే వాట్సన్ రేటు గురించి.. యువరాజ్ గురించి అందరూ చర్చించుకున్నారు.అలాగే పీటర్సన్ ను ఎవరు దక్కించు కున్నారు.. ఏ ఆటగాడు ఏ ఫ్రాంచైజీకి వెళ్ళాడు అనే అంశంపై తెగ చర్చలు నడిచాయి. కాని పెద్దగా పరిచయం లేని ఓ ఆటగాడు రాత్రికి రాత్రి ధనవంతుడయ్యాడు. ఈ విషయంపై పెద్దగా ఎవరూ దృష్టిపెట్టలేదు. ఇంతకీ అతనెవరో తెలుసా..? నాథూ సింగ్.  జైపూర్ కి చెందిన ఇతన్ని ముంబై ఇండియన్స్ 3.2 కోట్లు పెట్టి దక్కించుకుంది. దీంతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. అతని గురించిన తెలిసివాళ్ళు మాత్రం నాథూ అదృష్టం పండిందని సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకీ నాథూ ఎవరు..?
నాథూ సింగ్.. జైపూర్ లో ఓ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేసే భరత్ సింగ్ కుమారుడు. దేశవాళీ పోటీల్లో అతనికి అనుభవం కూడా తక్కువే. అంతేకాదు ఐపీఎల్ కి రావడం కూడా ఫస్ట్ టైమే. అయినా అతనిలో ఉన్న ప్రతిభను భారత బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ గుర్తించాడు. భారత్ ఎ జట్టుకు కోచ్ గా ఉన్న సమయంలో ద్రవిడ్..  నాథూ సింగ్ ఆటను గమనించాడు . గంటకు 160 కిలో మీటర్ల వేగంతో బంతులు వేయడం నాథూ ప్రత్యేకత. దాన్ని ద్రవిడ్ గుర్తించడంతో ఈ క్రికెటర్ ధనవంతుడిగా అవతరించాడు. తనకు అంత ధర పలకడంపై ఈ యంగ్ బౌలర్ కూడా ఆశ్చర్యానికి లోనయ్యాడట. ప్రస్తుతం తన కుటుంబం కష్టాలు తీరిపోయినట్లేనని చెబుతున్నాడట.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →