Loading...
You are here:  Home  >  Community Events  >  Awareness  >  Current Article

National Award for Punjagutta Police Station

By   /  January 6, 2018  /  No Comments

    Print       Email

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు జాతీయ పురస్కారం..!

 

Suvidha
Biryani Pot

 

 

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశంలోనే రెండో అత్యుత్తమ పోలీస్ స్టేషన్ గా హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు పురస్కారం దక్కింది. క్వాలిటీ కంట్రోల్ సంస్థ 85 సూచీల ఆధారంగా సేవారంగంలో ముందున్న పోలీసు స్టేషన్లను ఎంపిక చేసింది. పౌరులకు సేవలు అందించడం, గౌరవించడం, పౌర రక్షణ, విచారణ, తక్షణ సహాయం వంటి ఆధారంగా ఎంపిక జరుగుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ చేతుల మీదుగా పంజాగుట్ట ఎస్.హెచ్.ఓ రవీందర్ ఈ పురస్కారం అందుకున్నారు.

మధ్యప్రదేశ్ లోని తేకన్ పూర్ లో ఉన్న బీఎస్ఎఫ్ అకాడమీలో జరిగిన అన్ని రాష్ట్రాల డీజీపీలు, ఐజీపీల వార్షిక సమావేశంలో ఈ ట్రోఫీ ప్రధానం చేశారు. అయితే ఇందులో ప్రధానంగా ఉన్నతాధికారుల నుంచి స్టేషన్‌లోని ప్రతి ఇన్స్‌స్పెక్టర్ వరకు అందరిని పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేయడం జరిగింది. దేశంలోనే మోడల్ పోలీసు స్టేషన్‌గా గుర్తింపు రావడంతో పోలీసు అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Anasuya reveals her marriage secret

Read More →