Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

National Herald case update..

By   /  February 12, 2016  /  Comments Off on National Herald case update..

    Print       Email

sonia-rahul-trail court-national herald case

సుప్రీంకోర్టులో సోనియా, రాహుల్ కు ఊరట..!

InCorpTaxAct
Suvidha

 

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి సుప్రీం కోర్టులో స్వల్ప ఊరట లభించింది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి వారిద్దరికీ మినహాయింపు నిచ్చింది. వారితోపాటు మరో ఐదుగురికి కూడా మినహాయింపు నిచ్చింది. హైకోర్టు చేసిన కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తొలగించింది. హైకోర్టు పరిధి దాటి ఆదేశాలు ఇచ్చిందని అభిప్రాయ పడింది. కోర్టుకు హాజరవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సోనియా, రాహుల్‌ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే వారిద్దరి తరఫున సీనియర్‌ లాయర్ కపిల్‌ సిబాల్‌ వాదనలు వినిపించారు.

అభిషేక్‌ మను సంఘ్వీ శుక్రవారం ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. మోసం, విశ్వాస ఘాతుకం లాంటవేమీ అందులో లేవన్నారు. అదో చారిటబుల్‌ ట్రస్ట్‌ అని చెప్పారు. ఈ దశలో ఒక ముగింపునకు రావడం సరికాదని న్యాయస్థానం చెప్పిందన్నారు. నేషనల్‌ హెరాల్డ్‌ వ్యవహారంలో తప్పుడు ఆరోపణలతో కొంతమంది న్యాయస్థానానికి వెళ్లారని అన్నారు. సోనియా, రాహుల్ ఎప్పుడూ తప్పించుకోవాలని ప్రయత్నించలేదన్నారు. ట్రయల్‌ కోర్టుకు వెళ్లామని.. కేవలం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరామని తెలిపారు. సుప్రీం కోర్టు మినహాయింపునిచ్చిందని అభిషేక్‌ మను సంఘ్వీ తెలిపారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →