Loading...
You are here:  Home  >  Community Events  >  Current Article

NATS Cricket Tournament in St. Louis

By   /  November 7, 2019  /  No Comments

    Print       Email

సెయింట్ లూయిస్ లో  నాట్స్ క్రికెట్ టోర్నమెంట్ కు చక్కటి స్పందన 

InCorpTaxAct
Suvidha


సెయింట్ లూయిస్: నవంబర్ 4: సెయింట్ లూయిస్ లో  నాట్స్ క్రికెట్ టోర్నమెంట్ కు చక్కటి స్పందన అమెరికాలో తెలుగువారి కోసం  అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. సెయింట్ లూయిస్ లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించింది.15 టీంలు ఈ క్రికెట్ టోర్నమెంట్  లో పాల్గొన్నాయి. సెయింట్ లూయిస్ పరిసర ప్రాంతాల్లోని తెలుగు క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా ఈ టోర్నమెంట్ లో పాల్గొని తమ సత్తా చూపేందుకు ప్రయత్నించారు. వల్కన్స్ టీం, బ్లూ పాంతర్స్ టీంలు ఫైనల్ లో తలపడ్డాయి. ఆద్యంతం ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ టోర్నమెంట్ లో  వల్కన్స్ టీం విజేతగా నిలిచింది. బ్లూ పాంతర్స్ టీం రన్నరప్ గా నిలిచింది. వల్కన్స్ టీంకు చెందిన విశాల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రైజ్  దక్కింది. బ్లూ పాంతర్స్ కు చెందిన వెంకటేశ్ కు బెస్ట్ బ్యాట్ మెన్, వల్కన్స్ టీంకు చెందిన మహేశ్ కు బెస్ట్ బౌలర్ బహుమతులు దక్కాయి. సెయింట్ లూయిస్ చాప్టర్ నాట్స్ సమన్వయకర్త నాగ శ్రీనివాస శిష్ట్ల, నాట్స్ నేషనల్ కో ఆర్డినేటర్ రమేశ్ బెల్లం ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ దిగ్విజయంగా జరిగింది. శ్రీధర్ పాటిబండ్ల, ప్రీతమ్ ఈ టోర్నమెంట్ కు తమవంతు పూర్తి సహాయ సహాకారాలు అందించారు. వ్యాపారవేత్త విజయ్ బుడ్డి, టీఏఎస్ ప్రెసిడెంట్ సురేంద్ర బాచిన, అప్పాల నాయుడు, శిష్ట్ల నాగశ్రీనివాస్, రమేశ్ బెల్లం విజేతలకు, అత్యుత్తమ ఆటగాళ్లకు బహుమతులు అందించారు. ఈ టోర్నమెంటుకు నాట్స్ జాతీయ నాయకత్వం నుంచి మద్దతు అందించిన నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్  మంచికలపూడి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

South Indian Musical Concert by Vijay Prakash and Team

Read More →