Loading...
You are here:  Home  >  Deccan Abroad  >  Current Article

NATS sports event in Columbus

By   /  September 23, 2019  /  No Comments

    Print       Email

కొలంబస్ లో నాట్స్ వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లుఉత్సాహంగా పాల్గొన్న మహిళా జట్లు


సెయింట్ లూయిస్:సెప్టెంబర్ 21: అమెరికాలో తెలుగువారిని ఒక్కటి చేసే దిశగా  ఉత్తర అమెరికా తెలుగు సంఘం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగా కొలంబస్ నాట్స్ సెంట్రల్ ఓహియో విభాగం వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్లు నిర్వహించింది. అమెరికాలోని వివిధ నగరాల్లో ఉన్న తెలుగువారు ఎంతో ఉత్సాహంగా ఈ టోర్నమెంట్లలో పాల్గొన్నారు. మహిళల త్రోబాల్ పోటీల్లో తెలుగువనితలు తమ సత్తా చూపారు. డెట్రాయిట్, కొలంబస్ టీమ్ ల మధ్య జరిగిన త్రో బాల్ ఫైనల్ పోటీలు ఎంతో ఉత్కంఠగా సాగాయి. మహిళలు ఆద్యంతం గెలుపు కోసం పోరాడిన తీరు అందరిని ఆకట్టుకుంది. చివరకి ఫైనల్ లో కొలంబస్ టీంపై డెట్రాయిట్ టీం విజయం సాధించింది..తెలుగు మహిళల్లో కూడా క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్నామని నాట్స్ తెలిపింది. విజేతలకు ప్రత్యేక బహుమతులు అందించింది.

InCorpTaxAct
Suvidha
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

TAMA’s 10th Semiannual Chess Tournament

Read More →