Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Navjot Sidhu Quits BJP, Gets ‘Salute’ From Arvind Kejriwal

By   /  July 21, 2016  /  Comments Off on Navjot Sidhu Quits BJP, Gets ‘Salute’ From Arvind Kejriwal

    Print       Email

kejriwal-sidhuసిద్దూ రాజీనామాకు ఓ లెక్కుంది

 

InCorpTaxAct
Suvidha

 

 

న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ వ్య‌వ‌హారం ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సిద్దూ ఎందుకు అలా చేశారు? ఆయ‌న చేస్తున్న‌ది త‌ప్పా? ఒప్పా? అనే విష‌యాల‌ను ప‌క్క‌న పెడితే ఆయ‌న మాత్రం ప‌క్కా ప్లాన్‌గానే వెళ్తున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. తాను పదవి కోసం పాకులాడే మనిషిని కాదన్న ఇమేజ్ ను సొంతం చేసుకోవటంతో పాటు.. తనకున్న పేరు ప్రఖ్యాతుల్లో పంజాబీల గుండెల్లో దీర్ఘకాలం సాగేలా ఒక ప్లాన్ వేసుకున్నట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. తాను ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాలంటే ఏమేం చేయాలి.. ఏమేం చేయకూడదన్న అంశాలకు సంబంధించి సామాన్యుడి పార్టీని పెట్టిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో ఒక ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. తాను కింగ్ గా ఉండే ఛాన్స్ లేదని తేల్చేసిన సిద్ధూ.. ప్రస్తుతానికి కింగ్ మేకర్ పాత్రను పోషించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.

సిద్ధూ కండీషన్లకు కేజ్రీవాల్ సైతం సానుకూలంగా స్పందించినట్లుగా తెలిసింది. తనకు కానీ.. తన భార్యకు కానీ ఎలాంటి పదవి అక్కర్లేదని.. తాము అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయమని.. పార్టీ పదవులు కూడా చేపట్టమని చెప్పినట్లుగా కథనాలు వస్తున్నాయి. మరి.. ఎలాంటి ఆశలు.. ఆకాంక్షలు లేకుండా రాజ్యసభ పదవిని సిద్ధూ వదిలేస్తారా? అన్నది మరో సందేహం. ఏది ఏమైనా ప్రస్తుతానికి కింగ్ మేకర్ పాత్రను పోషించినప్పటికి.. భవిష్యత్తులో ఆయనెలా వ్యవహరిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు. డీల్ మొదట్లో కుదిరినంత చక్కగా కాలక్రమంలో అంతేలా కంటిన్యూ అవుతుందా?  లేదా ? అన్న‌ది తెలుసుకోవ‌డానికి మ‌రికొంత కాలం ఆగాల్సిందే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →