త్వరలో ‘డోర’ తెలుగు టీజర్
నయనతార హీరోయిన్ గా నటిస్తున్న మూవీ ‘డోర’. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాకి దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు టీజర్, ఆడియో విడుదలకు కసరత్తు చేస్తున్నారు.
అయితే ‘డోర’ అనే టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటని పలువురు చర్చించుకుంటున్నారు. దీనిపై నెలకొన్న ఉత్కంఠ విషయంలో నిర్మాత మల్కాపురం శివకుమార్ స్పందించారు. నిజంగానే సినిమా అంతా ఉత్కంఠగా ఉంటుందని అన్నారు. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు ప్రతీ సీన్ థ్రిల్లింగా ఉంటుందని అన్నారు. ముఖ్యంగా నయన్ యాక్షన్ , షూటింగ్ కొత్తరకంగా ఉంటుందని చెప్పారు. రీసెంట్ గా రిలీజ్ అయిన తమిళ టీజర్ పలువురిని ఆకట్టుకుంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలో ఈ టీజర్ ని టాలీవుడ్ లో కూడా రిలీజ్ చేస్తామని నిర్మాత చెప్పారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.