Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Nayanthara cast in Nandamuri Balakrishna’s 100th film ‘Yodhudu’?

By   /  April 1, 2016  /  Comments Off on Nayanthara cast in Nandamuri Balakrishna’s 100th film ‘Yodhudu’?

    Print       Email

bala krishna - ok

యోధుడు’ సరసన నయన్..

InCorpTaxAct
Suvidha

 

 

బాలయ్య వందో సినిమా గురించి జనంలో బాగా క్రేజ్ పెరిగిపోతోంది.దీనికితోడు ఆయన వందో సినిమా గురించి రోజుకో కొత్త విషయం బయటకు తెలుస్తోంది. ఒక్కో విషయం బయటకు వస్తూండటంతో అభిమానులు ఎంతో ఉత్కంఠగా బాలయ్య బాబు సినిమా కబురు గురించి ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వంతో సినిమా డైరెక్టర్ ఎవరు..? ఈ ప్రశ్నకు రీసెంట్ గా సమాధానం దొరికింది. గౌతమి పుత్ర శాతకర్ణి కథతో క్రిష్ త్వరలో సినిమాని తెరకెక్కించనున్నారు.

ఇక గతంలో క్రిష్ నిర్మించిన కంచె మూవీకి జాతీయ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో తాజా చిత్రంపై ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇక బాలయ్య సరసన నటించే హీరోయిన్ విషయంలో కూడా చాలా వరకు స్పష్టత వచ్చేసింది. ఈ మూవీలో నయన తార హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో శ్రీరామ రాజ్యం సినిమా వచ్చిన విషయం తెలిసిందే. అలాగే సింహా సినిమాలో కూడా ఈ జంట ప్రేక్షకులను ఆకట్టుకుంది.

వాస్తవంగా ఈ పాత్ర కోసం అనుష్క పేరు తెరమీదకు వచ్చిందట. అయితే చివరకు నయనతారను ఎంపిక చేశారట. ఓ రకంగా మళ్ళీ హిట్ పెయిర్ ను తెరమీదకు తీసుకువస్తున్నాడు క్రిష్. ఇంతకు ముందు నయన్-క్రిష్ కాంబినేషన్‌లో ‘కృష్ణం వందే జగద్గురుం’ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా ఏప్రిల్‌లో మొదలు కానుంది. మే నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ‘యోధుడు’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమా అధికార ప్రకటన ఉగాది (ఏప్రిల్ 8) నాడు వచ్చే అవకాశముందని టాలీవుడ్ టాక్.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →