Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Nayum finally taken down by police

By   /  August 9, 2016  /  Comments Off on Nayum finally taken down by police

    Print       Email

nayumన‌ర‌హంత‌కుడు న‌యూం.. హ‌తం!

 

InCorpTaxAct
Suvidha

 

 

రెండు ద‌శాబ్దాల పాటు తెలుగు రాష్ట్రాల‌ను హ‌డ‌లెత్తించిన మాజీ మావో యిస్టు, కరడు కట్టిన నేరగాడు న‌యూం పోలీసు కాల్పు ల్లో హతమయ్యాడు. పోలీసు శాఖను ముప్పతిప్పలు పెట్టిన న‌యూంను మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ గ్రేహౌండ్స్ దళాలు సోమవారం ఉదయం మట్టుబెట్టాయి. షాద్‌నగర్ మిలీనియం టౌన్‌షిప్‌లో ఉంటున్న గ్యాంగ్‌స్టర్ న‌యూం ముఠాపై గ్రేహౌండ్స్ దళాలు కాల్పలు జరిపాయి. ఈ కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ న‌యూం హతమయ్యాడని రాష్ట్ర డిజిపి మీడియాకు తెలిపారు. కాగా పోలీసుల కాల్పుల్లో ఓ మహిళ, మరో అనుచరుడు మృతి చెందారు.  కాగా  ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో న‌యూంపై ఎస్ఐబీ, గ్రేహౌండ్స్ పోలీసులు ఎటాక్ చేసినట్లు సమాచారం. ఐపీఎస్ వ్యాస్ హత్య కేసులోనూ న‌యూం నిందితుడిగా ఉన్నాడు. పలు భూదందాలు, సెటిల్‌మెంట్లలో సైతం అతడి ప్రమేయం ఉంది. యాంటీ మావోయిస్టు గ్యాంగ్‌ను తయారు చేసిన న‌యూం మాజీ మావోయిస్టు సాంబశివుడు, అతడి సోదరుడు రాములు హత్య కేసులో సైతం ప్రధాన నిందితుడిగా చెప్పవచ్చు.

నయూంపై దాదాపు 120కుపైగా కేసులు ఉన్నాయి. పౌరహక్కుల నేత పురుషోత్తం, ప్రజాగాయకురాలు బెల్లి లలిత హత్యకేసుల్లోనూ నయూం ప్రధాన నిందితుడు. లలితను దారుణంగా హత్య చేసిన న‌యూం ఆమెను18 ముక్కలు చేసి ఒక్కోచోట పడేశాడు. 2001లో న‌యూం చివరిసారి అరెస్ట్ అయ్యాడు. నయీమ్ స్వస్థలం నల్గొండ జిల్లా భువనగిరి. న‌యూం మృతిని ప్రభుత్వ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. నయూం హతంతో జిల్లాలో తెలంగాణ మంత్రుల పర్యటనలు రద్దు అయ్యాయి. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన గ్యాంగ్‌స్టర్ నయీంకు పలు టెర్రరిస్టు సంస్థలతో సంబంధాలున్నాయని తెలుస్తోంది. ఈ విషయం ఎన్ఐఏ దర్యాప్తులో బయటపడింది. ఇటీవల హైదరాబాద్‌లో పేలుళ్లకు పథకం రచించిన ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టు చేసినపుడు న‌యూం పాత్రను ఎన్ఐఏ ధ్రువీక‌రించుకుంది.

అప్పటి నుంచి న‌యూం అక్టోపస్, ఎన్ఐఏ బలగాలు వెంటాడుతున్నాయి. ముంబై, కోల్‌కతా నగరాల నుంచి న‌యూంకు సంబంధించిన లీడ్స్ పోలీసులకు లభించాయి. అందులో భాగంగానే షాద్‌నగర్‌లో న‌యూం ఉంటున్న ఇంటిని ఎన్ఐఏ గుర్తించింది. న‌యూం ఏపీ, తెలంగాణలో విధ్వంసం సృష్టించడం కోసం ఉగ్రవాద సంస్థలకు గత ఐదేళ్లుగా లాజిస్టిక్ మద్దతు ఇస్తున్నట్టు ఎన్ఐఏ గుర్తించింది. అందరూ ఊహించినట్టు న‌యూం మామూలుగా గ్యాంగ్‌స్టర్ కాదని, అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నాడని ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →