Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Nayum net worth 10,000 crores?

By   /  August 10, 2016  /  Comments Off on Nayum net worth 10,000 crores?

    Print       Email

nayumన‌యీం ఆస్థులు రూ.10వేల కోట్లా?

 

InCorpTaxAct
Suvidha

 

 

గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్ తర్వాత పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈమేరకు వేర్వేరు ప్రాంతాలలో 25మంది నయీం అనుచరులను అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నయీం అనుచరులను కోర్టులో హాజరుపరిచారు. నయీం వంట మనిషి ఫర్హనాతోపాటు పది మంది మహిళా అనుచరులను మంగళవారం పోలీసులు రాజేంద్ర నగర్ కోర్టులో హాజరుపరిచారు. ఇదిలావుండగా ల్యాండ్ సెటిల్‌మెంట్లు, భూముల వివరాలు, డబ్బుల వసూళ్లకు సంబంధించిన వివరాలు ఈ డైరీల్లో ఉన్నాయి తెలుగు రాష్ట్రాలలో కొందరి వీఐపీల పేర్లు ఉన్న‌ట్లు స‌మాచారం. వారిని బెదిరించి పెద్ద ఎత్తున సొమ్ములు వసూలు చేయాలని డైరీలో రాసుకున్నట్లు తెలియవచ్చింది. అలాగే నయీం తనకుతానుగా తీర్పులు ఇవ్వడం, జరిమానా విధించి వసూలు చేసిన వివరాలు అతని డైరీలో ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా బలవంతపు వసూళ్ల వివరాలను నయీం డైరీలో రాసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఎవరికి డబ్బులు ఇచ్చినది, ఖర్చు చేసిన వివరాలు డైరీలో ఉన్నాయని చెప్పారు. నయీం కొనుగోలు చేసిన స్థిర, చరాస్తుల వివరాలు డైరీలో ఉన్నాయని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.

ఇదిలా ఉంటే  నయీంకు సంబంధించిన కేసుల విచారణకు సిట్ ఏర్పాటు చేయా లని డీజీపీ అనురాగ్ శర్మ నిర్ణయించారు. సిట్ సభ్యులను డీజీపీ బుధవారం నాడు ఖరారు చేయనున్నారు. ఇప్పటికే నయీం నివాసాంలో సోదాలు చేసిన పోలీసులు నాలుగు రివాల్వర్లు, 220 తూటాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, రూ. 2.08 కోట్లు, 1.9 కిలోల బంగారం, 873 గ్రాముల వెండి, 258 సెల్‌ఫోన్లు, 203 ఆస్తి పత్రాలు, ఆడి క్యూ-7 కారు, హీరో హోండా, యమహో క్రూయిజ్, బుల్లెట్, హోండా యాక్టివా, భారీగా హార్డ్ డిస్క్‌లు, పెన్ డ్రైవ్‌లు, ల్యాప్‌టాప్‌లు, మెమరీ కార్డులు, భారీగా పాస్ పుస్తకాలు, చెక్ బుక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వీటి విలువ దాదాపు పదివేల కోట్ల రూపాయల పైమాటే ఉంటుందని పోలీసు వర్గాలు భావిస్తు న్నాయి.

నార్సింగిలోని పుప్పాలగూడలోని నయీం ఇల్లు రెండో అంతస్తులో ఉన్న గదిని తెరిచేందుకు పోలీసులు రాజేందన్రగర్ కోర్టు అనుమతి తీసుకున్నారు. అరెస్టు అయిన ఇద్దరు మహిళల సమాచారంతో ఆ గదిని తెరవ డానికి పోలీసులు సిద్ధమయ్యారు. బుధవారం ఆ గదిలో పోలీసులు సోదాలు చేయనున్నారు ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీం వద్ద వేలకోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్టు తనిఖీల్లో తేలింది. ముంబై మాఫియాను మించిన నగదు, భూములు, నగలు, వజ్రాలు ఉన్నాయని, వీటి లెక్క తేల్చడం  ఇప్పట్లో సాధ్యంకాదని అధికారులు చెబుతున్నారు. నయీంకు సంబంధించి వెలుగులోకి వస్తున్న కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు, డాక్యుమెంట్లు చూసి అధికారులు విస్తుపోతున్నారు. బినామీ పేర్లను కూడా పరిశీలిస్తున్నారు.గ్యాంగ్ స్టర్ నయీంకు కొండాపూర్‌లో ఒకే చోట 69 ఎకరాల భూమి ఉంది. దీని విలువ వెయ్యి కోట్ల రూపాయలకుపైగానే ఉంటుందని రెవిన్యూ అధికారాలు అంచనా.

అలాగే పుప్పాలగూడ, మణికొండల్లో 40 చోట్ల ఖరీదైన ఫ్లాట్లు. వీటి విలువ మరో వెయ్యికోట్ల వరకు ఉండవచ్చునల్లగొండ జిల్లా భువనగిరి సమీపంలో బొమ్మలరామరంలో 500 ఎకరాలు రమారమీ వీటి విలువ 800కోట్లు ఉండవచ్చన్నది సమాచారం. హైదరాబాద్ నగరంలో పదలుకొద్దీ ఫ్లాట్లు, ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో స్థలాలు, ఆడి కారు సహా హోండా సీఆర్వీ, ఫోర్డ్ ఎండీవర్ కార్లు సరూర్ నగర్‌లోని ఎన్టీఆర్ నగర్‌లో 1180 గజాల సైటు ప్లాటును స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా చినకాకానిలో సర్వే నెంబర్ 230/231 పత్రాలు, అత్తాపూర్‌లో సర్వే నెం 462, 468లో ఫ్లాటు నెంబర్ 9 పత్రాలు, కొండా పూర్‌లో సర్వే 87 పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. షేక్‌పేట్‌లో మరో ఫ్లాటు పత్రాలు, ముసారాబాద్‌లో మరో నాలుగు స్థలాల పత్రాలు గుర్తించారు.

కాగా మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించిన అనంతరం నయీం మృతదేహాన్ని మంగళవారం మధ్యాహ్నం అతని బంధువులకు అప్పగించారు. ఆ తర్వాత నల్లగొండ జిల్లా భువనగిరికి తరలించారు. అయితే నయీం భార్య, పిల్లలు వచ్చే వరకు అంత్యక్రియలు చేయబోమని బంధువులు చెబుతున్నారు. . భువనగిరిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా భారీగా పోలీసులను మోహరించారు. నయీం అంత్యక్రియలపై పోలీసులు ఆంక్షలు విధించారు. అంత్యక్రియల దృశ్యాలను లైవ్ టెలికాస్ట్ చేయరాదని, ఆంక్షలు ఉల్లంఘించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు మీడియాకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →