Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Netaji not died in a plane crash ..?

By   /  April 1, 2016  /  Comments Off on Netaji not died in a plane crash ..?

    Print       Email

nethaji photo

విమాన ప్రమాదంలో నేతాజీ మరణించలేదా..?

InCorpTaxAct
Suvidha

 

 

 

నేతాజీ 1945లో జరిగిన విమాన యాక్సిడెంట్ లో చనిపోలేదని తెలుస్తోంది. ఈ విషయం మంగళవారం కేంద్రం విడుదల చేసి రహస్య పత్రాల ఆధారంగా తెలుస్తోంది. 1945 ఆగస్ట్ 18న తైపీలో జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ లో సుభాష్ చంద్రబోస్ తీవ్రంగా గాయపడ్డారని .. ఆ తర్వాత ఆయన చికిత్స పొందుతూ చనిపోయినట్లు కొన్ని ఆధారాలను బట్టి తెలుస్తోంది. అయితే విమాన ప్రమాదం తర్వాత కూడా ఆయన జీవించి ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవలె రిలీజ్ చేసిన రహస్య ప్రతాలు వెల్లడిస్తున్నాయి.

ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ కు చెందిన 3 ప్రసంగాలు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. అప్పటి బెంగాల్ గవర్నర్ హౌస్ నుంచి లభించిన పత్రాల ఆధారాలను పీఎంవో బయటపెట్టింది. ఈ పత్రాల ప్రకారం.. 1945 డిసెంబర్ 26న ప్రజలను ఉద్దేశించి నేతాజీ ఓ ప్రసంగం చేశారు. తాను పెద్ద ప్రపంచ శక్తుల ఆశ్రయంలో ఉన్నానని తెలిపారు. అయితే తన గుండె భారత్ కోసం రగిలిపోతోందన్నారు. మూడవ వరల్డ్ వార్ సమయానికల్లా భారత్ కు వస్తానని అన్నారు. ఇంచుమించు పదేళ్ళు లేదా అంతకంటే తక్కువ టైమ్ లోనే ఇది జరగవచ్చని తెలిపారు. అనంతరం రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగే తీర్పులో తాను పాల్గొంటానన్నారు.

1946 జనవరి 1 నాడు నేతాజీ చేసిన మరో ప్రసంగం కూడా వెలుగులోకి వచ్చింది. రెండేళ్ళలో భారత్ కు స్వాతంత్ర్యం సిద్దించాలని అందులో ఆయన ఆకాక్షించారు. బ్రిటీష్ సామ్యాజ్యవాదం నాశనమైందన్నారు. ఇక భారత్ కు స్వాతంత్ర్యం ప్రకటించక తప్పదన్నారు. అహింసతో స్వాతంత్ర్యం రాదన్న ఆయన.. గాంధీ ఆశయాన్ని గౌరవిస్తానన్నారు. 1946 ఫిబ్రవరి నాటి మూడవ ప్రసంగంలో తాను సుభాష్ చంద్రబోస్ ని మాట్లాడుతున్నానని అన్నారు. అంతేకాకుండా జైహింద్ అంటూ ఉచ్ఛరించారు. సెకెండ్ వరల్డ్ వార్ లో జపాన్ లొంగిపోయిన తర్వాత భారత్ లోని తన సోదర సోదరీమణులను ఉద్దేశించి మాట్లాడటం ఇది మూడవ సారి అన్నారు. లారెన్స్‌తో పాటు మరో ఇద్దరిని ఇంగ్లండ్ ప్రధాని భారత్ పంపుతున్నారని తెలిపారు. వారి లక్ష్యం బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని సుస్థిర పరిచి భారతీయుల రక్తం పీల్చడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.

1946 జులై 22న మహాత్మా గాంధీ కార్యదర్శి నరోజీ, బ్రిటన్ అధికారి లూయిస్ ఫిస్చెర్‌కు రాసిన లేఖలోనూ నేతాజీ ప్రస్తావన ఉంది. ఇండియన్ నేషనల్ ఆర్మీ పట్ల భారత జవాన్లలో సానుభూతి పెరుగుతోందన్నారు. రష్యా సహకారంతో సుభాష్ చంద్ర బోస్ యుద్ధానికి వస్తే గాంధీ గాని.. నెహ్రూ గాని..కాంగ్రెస్ గాని ఏమీ చేయలేవన్నారు. సెకెండ్ వరల్డ్ వార్ తర్వాత సుభాష్ చంద్ర బోస్ అంశంలో ఏమి చేయాలనే దానిపై బ్రిటన్ పాలకులు, భారత దేశ వైస్రాయ్ లార్డ్ వేవెల్ చర్చలు జరిపారు. 1945 అక్టోబర్ 25 నాటి అధికార ప్రతాల ద్వారా నేతాజీ సుభాష్ బోస్ విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన మరణంపై వ్యక్తమవుతున్న సందేహాలకు అంతులేకుండా పోయింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →