దసరా నాటికి కొత్త జిల్లాల ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లాల్లో దసరా రోజునే జిల్లా కలెక్టర్‌తో సహా ప్రభుత్వ యంత్రాంగమంతా బాధ్యతలు చేపట్టాలని రాష్ట ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, రెవెన్యూ, తదితర విభాగాలు, వ్యవస్థల ఏర్పాటుకు సంబంధించిన రిపోర్టును ఈనెల 20వ తేదీలోపు రాబట్టుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృది కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వర్క్‌షాప్ నిర్వహించారు. పునర్వ్యవస్థీకరణపై కలెక్టర్లు ఇప్పటి వరకూ చేసిన కసరత్తును అడిగి తెలుసుకున్నారు. దాంతో ప్రతిపాదిత జిల్లాలు, డివిజన్లు, మండలాలపై కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రజంటేషన ఇచ్చారు. ‘‘మండలాల్లో ప్రజల ఆకాంక్షలు ఎలా ఉన్నాయి? ఎవరితోనైనా మాట్లాడారా? స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రు లు, ప్రజా ప్రతినిధులతో చర్చించారా?’’ అని కేసీఆర్ అడిగి తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఒక జిల్లా ఎలా ఉండాలో చెప్పారు. “40 వేల నుంచి 50 వేల జనాభా ఉండేలా ఒక మండలం, 20 మండలాలతో ఒక జిల్లా ఉండాలి. దాదాపు లక్షన్నర జనాభాతో అర్బన మండలం, ఒక రెవెన్యూ డివిజన పరిధిలో 10-12 మండలాలు, రెండు అసెంబ్లీ సెగ్మెంట్లు, ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 5 నుంచి 6 మండలాలు ఉండే విధంగా కసరత్తు జరగాలి. అసెంబ్లీ నియోజక వర్గమే సరిహద్దుగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయవద్దు. ఒక నియోజకవర్గం రెండు మూడు జిల్లాల్లో ఉండొచ్చు“ అని సీఎం పేర్కొన్నారు.
మారుతున్న కాలంతో మారుతూ అభివృద్ధిని అందుకోవాలని, లేకపోతే తెలంగాణ ప్రగతి సాధ్యం కాదన్నారు. చిన్న దేశాలు, వాటిలోని జిల్లాలు, పరిపాలనా కేంద్రాలను ఉదాహరించారు. ‘‘తెలంగాణలో మరి కొద్ది సంవత్సరాల్లో ఉహించనంతగా అభివృద్ధి జరగనుంది. హైదరాబాద్ ట్రాఫిక్‌ను భవిష్యత్తులో హెలికాప్టర్లతో పర్యవేక్షించే పరిస్థితులు వస్తాయి’’ అన్నారు. ఏది ఏమైనా దసరా రోజున అందరూ ఆయా జిల్లాల్లో పని చేయాల్సి ఉంటుందని, ఫర్నిచర్, వాహనాలు, భవనాలు తదితర అంశాల పై ఆయా విభాగాల అధికారులతో నేరుగా మాట్లాడి, వివరాలు, లోటుపా ట్లు తెలుసుకోవాలన్నారు. ప్రస్తుత జిల్లా నుంచి పక్కకుపోయే మండలాలతోపాటు జిల్లాలు, డివిజన్లపై ఈనెల 20న జరిగే కలెక్టర్ల సమావేశంలోపు సమగ్ర నివేదికను సీసీఎల్ఏకు అందజేయాలని, ఈ ప్రతిపాదనకు సీసీఎల్ఏతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తుది రూపం ఇవ్వాలని సీఎం స్ప ష్టం చేశారు. దీనిపై ఈనెల 30వ తేదీలోగా స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులతో అభిప్రాయ సేకరణ, చర్చ చేపట్టాలని కేసీఆర్ కలెక్టర్లకు సూచించడం గమనార్హం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.