తెలంగాణలో కొత్త జిల్లాలు ఇవే!
పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 10 జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలను పెంచాలని తీసుకున్న నిర్ణయం దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. సంబంధిత అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇప్పటికే మార్పు చేసి కొత్త జిల్లాలపై ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించినట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లాలో మాత్రం వికారాబాద్ జిల్లాగా మాత్రమే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే వరంగల్ జిల్లాలోని జనగాం జిల్లా కేంద్రానికి బదులుగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి మ్యాపులు, సరిహద్దుల వివరాలన్నీ భూపరిపాలనా ప్రదాన కమిషనరేట్(సీసీఎల్ఏ) సిద్ధం చేసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం కేంద్రంగా కొత్తగా భద్రాద్రి జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. నల్గొండ జిల్లాలోని భువనగిరి కేంద్రంగా యాదాద్రి జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ప్రజల నుంచి వెల్లువెత్తిన డిమాండ్లను పరిశీలించిన అధికార యంత్రాంగం వరంగల్ జిల్లాలోని జనగామకు బదులుగా మహబూబాబాద్‌కు కొత్త జిల్లాలల జాబితాలో చోటు దక్కింది.
తెలంగాణలో ఇప్పటి వరకు ఉన్న జిల్లాలు 10 అయితే మరో 14 జిల్లాలు కొత్తగా వచ్చి చేరనున్నాయి. ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, హైదరాబాద్, మెదక్ జిల్లాలు ఉండగా ఇప్పుడు మరో 14 వచ్చి చేరుతున్నాయి. అవే కొమురం భీం జిల్లా (మంచిర్యాల), జగిత్యాల, ఆచార్య జయశంకర్‌జిల్లా (భూపాలపల్లి), మహబూబాబాద్. భద్రాద్రి జిల్లా (కొత్తగూడెం). యాదాద్రి (భువనగిరి). సూర్యపేట. వనపర్తి. నాగర్‌కర్నూల్. సంగారెడ్డి. సిద్దిపేట. కామారెడ్డి. వికారాబాద్. సికింద్రాబాద్. తెలంగాణ రాష్ట్రం త్వరలో 24 జిల్లాల రాష్ట్రంగా వెలుగొందబోతోంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.