మోడీ టీంలోకి మరో 19 మంది
ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన టీంను పెంచుకుంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం ఉన్న సభ్యులకు తోడు మరో 19 మందికి తన టీంలోకి అవకాశం కల్పించారు. దీంతో ఇప్పటివరకు 64 మందిగా ఉన్న మంత్రివర్గ సభ్యుల సంఖ్య తాజా విస్తరణతో 78కి పెరిగింది. కాగా ఇప్పటివరకూ సహాయమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రకాశ్ జవదేకర్ కు కేంద్రమంత్రిగా పదోన్నతి లభించింది. ఆయనతో పాటు పదకొండు మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం కేంద్ర సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన 19 మందిలో 17 మంది బీజేపీ నేతలే కాగా.. ఇద్దరు మాత్రం మిత్రపక్షాలకు చెందిన వారు వారిలో రామ్ దాస్ అధవాలే మాత్రం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఉత్తరప్రదేశ్ కు చెందిన అనుప్రియ పటేల్ అప్నాదళ్ పార్టీ నేత కావటం గమనార్హం. రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమాని రాష్ట్రపతి ప్రణబ్ నేతృత్వం వహించగా.. ఉప రాష్ట్రపతి అన్సారీ.. ప్రధాని మోడీతో పాటు.. ఆయన క్యాబినెట్ మంత్రులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
మోడీ టీమ్ లో కొత్త వాళ్లు వీరే…
- ఫగ్గన్ సింగ్ కులస్తే (మధ్యప్రదేశ్)
- ఎస్ఎస్ అహ్లువాలియా (పశ్చిమ్ బెంగాల్)
- రమేష్ చందప్ప జిగజినాగి (కర్ణాటక)
- విజయ్గోయాల్ (రాజస్థాన్)
- రామ్‌దాస్ అథవలే (మహారాష్ట్ర)
6.రాజెన్ గోహేన్ (అసోం)
- అనిల్ మాధవ్ దవే (మధ్యప్రదేశ్)
- పురుషోత్తమ్ రూపాలా (గుజరాత్)
- ఎంజే అక్బర్ (ఝార్ఖండ్)
- అర్జున్ రామ్ మేఘ్వాల్ (రాజస్థాన్)
- జశ్వంత్ సిన్హ్భాబోర్ (గుజరాత్)
- మహేంద్రనాథ్ పాండే (ఉత్తర ప్రదేశ్)
- అజయ్ టంటా (ఉత్తరాఖండ్)
14 కృష్ణారాజ్ (ఉత్తరప్రదేశ్)
- మన్సుఖ్ భాయ్ మందావియా (గుజరాత్)
- అనుప్రియ పటేల్, (ఉత్తర్ ప్రదేశ్)
- సీఆర్ చౌదరి (రాజస్థాన్)
- పీపీ చౌదరి (రాజస్థాన్)
- శుభాష్ రామ్రావ్ భామ్రే (మహరాష్ట్ర)
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.