విజయ్ దేవరకొండ సరసన మెగా హీరోయిన్..?
మెగా హీరోయిన్ నీహారిక ‘ఒక మనసు’ సినిమాతో తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. నీహారిక ఎంట్రీ సందర్భంగా టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదుగుతుందని అందరూ భావించారు. అయితే ఈ చిత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో డీలా పడిపోయింది. అయితే ఈ మెగా హీరోయిన్ కి అవకాశాలు మాత్రం గట్టిగానే వస్తున్నాయి. మొదటి సినిమా దెబ్బతో.. నీహారిక తన రెండో సినిమా ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. అందుకే ఈ సారి స్ట్రెయిట్ సినిమా కాకుండా.. రీమేక్ సినిమాని ఎంచుకుందట. పంజాబీకి చెందిన ఓ థ్రిల్లర్ సినిమా.. తెలుగు రీమేక్ లో నటిస్తోంది.
అలాగే మరో సినిమాకి కూడా ఒకే చెప్పేసింది. కార్తీక్ అనే నూతన దర్శకుడు చెప్పిన కథ నీహారికకు బాగా నచ్చిందట. దీంతో వెంటనే ఒకే చెప్పేసింది. ఈ సినిమాలో ‘పెళ్లిచూపులు’ హీరో విజయ్ దేవరకొండ సరసన కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక..ఈ చిత్రంలో నీహారిక డిఫరెంట్ లుక్ తో కనిపించబోతోందని సమాచారం. మరి ఈ సినిమాతో అయినా.. నీహాకి హిట్ దక్కుతుందో లేదో చూడాలి మరి..!
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.