– అధికారులను ఆదేశించిన రాజీవ్ శర్మ
రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన హైదరాబాద్ ఫార్మాసిటి (నిమ్జ్) మెగాటెక్స్ టైల్ పార్కులకు సంబంధించిన పనులను వేగవంతం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు డా. రాజీవ్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో హైదరాబాద్ ఫార్మాసిటి, వరంగల్ మెగాటెక్స్ టైల్ పార్కుల నిర్మాణాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు డా. రాజీవ్ శర్మ మాట్లాడుతూ ఫార్మాసిటికి సంబంధించి మొదటి దశలో 2 వేల ఎకరాలలో నిర్మించనున్నట్లు తెలుపుతూ ఇందుకు సంబంధించి మౌళిక సదుపాయాల ఏర్పాటు, పర్యావరణ అనుమతులు, మాస్టర్ ప్లాన్, డి.పి.ఆర్, ఎన్విరాన్ మెంటల్ ఇంపాక్ట్ అసెన్ మెంట్ స్టడీస్ తదితర అంశాలపై చర్చించారు.
ఔషధ పరిశ్రమకు సంబంధించిన పారిశ్రామిక వేత్తలు, యాజామాన్యాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఫార్మాసిటిలో మ్యానిఫాక్చరింగ్ యూనిట్, ఆర్.అండ్.డి (Research and Development), అనుబంధ పరిశ్రమలు, బల్క్ డ్రగ్స్ తదితర సంస్ధల ఏర్పాటుకు అవసరమైన భూముల గురించి చర్చించారు. పారిశ్రామిక వేత్తలకు భూములు కేటాయించేలా పార్కును అభివృద్ధి చేయాలన్నారు. వివిధ రాష్ట్రాలలో ఔషధ పరిశ్రమలకు అందిస్తున్న రాయితీలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఫార్మాసిటి పనులకు సంబంధించి ప్రతి 15 రోజుల కొకసారి సమావేశం కావాలని ఆయన సూచించారు.
వరంగల్ లో ప్రతి పాధించిన మెగా టెక్స్ టైల్ పార్కు నిర్మాణానికి సంబంధించి దశల వారిగా అభివృద్ధి ప్రతిపాదనలను రూపొందించాలని చేనేత, రెడిమెడ్ వస్త్రాల తదితర రంగాలకు చెందిన కంపెనీలతో సమావేశం కావడానికి నిర్ణయించాలన్నారు. మినీపార్కుల ఏర్పాటుకు సంబంధించి కేంద్రానికి ప్రతి పాదనలు తయారు చేయాలన్నారు. మెగాపార్కులో అంతర్గత మౌళిక సదుపాయాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏప్రిల్ 21 న హైదరాబాద్ లో జరిగే టెక్స్ టైల్స్ సమ్మిట్ సందర్భంగా ఇన్వెస్టర్స్ సమావేశం ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.