Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Nitin – Pawan

By   /  May 1, 2016  /  Comments Off on Nitin – Pawan

    Print       Email

nitin-pawanఅభిమాని కోసం ప‌వ‌న్‌..!

 

InCorpTaxAct
Suvidha

 

 

హీరో నితిన్‌కు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే ఎంత ఇష్ట‌మో అంద‌రికీ తెలుసు.  నితిన్ త‌న సినిమాలో కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్‌లాగా డైలాగులు చెప్ప‌డానికి, ఆయ‌న మాదిరి న‌టించ‌డానికి ప్ర‌య‌త్నంచేస్తుంటాడు. అంతేకాదు ప‌వ‌న్ క‌ల్యాణ్ అనుమ‌తితో త‌న సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ పాట పెట్టుకుని త‌నే డ్యాన్స్ చేసిన సంగ‌తి కూడా తెలిసిందే. అయితే ప‌వ‌న్ అభిమానిగా ముద్ర‌వేసుకున్న నితిన్‌ను కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ అంతే ప్రేమ‌గా ప‌లుక‌రిస్తాడు.`అ`, `ఆ` సినిమా షూటింగ్‌కు వెళ్లి మ‌రీ అంగ‌డి సంగ‌తులు తెసుకున్నారంటే ప‌వ‌న్‌కు కూడా నితిన్ అంటే ఇష్ట‌మ‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే నితిన్, సమంత ప్రధాన పాత్రలలో తెరకెక్కిన అ..ఆ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. మే 2న శిల్పకళా వేదికలో జరగనున్న ఈ చిత్ర ఆడియో వేడుకను డిఫరెంట్ స్టైల్లో, వెరైటీ కాన్సెప్ట్‌తో జరిపేందుకు త్రివిక్రమ్ స్కెచ్‌లు వేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమా మెయిన్ పాయింట్‌ని జనాల్లోకి పంపేందుకు ఈ ఆడియో వేడుకను వాడుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. అయితే ఈ మూవీకి చీఫ్ గెస్ట్‌గా ఎవరు హాజరు అవుతారని అందరు ఆలోచిస్తుండగా, పవన్ కళ్యాణ్ తన సినిమాకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని నితిన్ తన ట్విట్ట‌ర్‌లో తెలిపారు. ఆ ఫంక్ష‌న్‌కు ప‌వ‌న్ వ‌స్తే మాత్రం నితిన్ ఆనందానికి అవదులుండ‌వ్‌.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →