పోటా పోటీగా భేటీలు నిర్వహించిన నితీశ్ కుమార్-శరద్ యాదవ్..
బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యంలో జేడీయూ ఎన్డీయే కూటమిలో చేరేందుకు మార్గం సుగుమం అయింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అయితే నితీష్ సమావేశానికి వ్యతిరేకంగా ఆ పార్టీ సీనియర్ నేత శరద్ యాదవ్ కూడా తన మద్దతుదారులతో సమావేశం నిర్వహించారు. దీంతో పార్టీలో ఘర్షణ వాతావరణం చెలరేగింది. పాట్నా వెళ్ళిన శరద్ యాదవ్ జన్ అదాలత్ భేటీ నిర్వహించారు.
శరద్ యాదవ్ పాట్నాకు వెళ్ళగానే ఆయన మద్దతుదారులు నితీష్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా శరద్ యాదవ్ తనదే అసలైన జేడీయూ అని స్పష్టం చేశారు. మహా కూటమి నుంచి బయటకు రావాలని నితీశ్ తీసుకున్న నిర్ణయంతో ఆయనకు శరద్ యాదవ్ మధ్య విభేధాలకు కారణమైంది. ఈ నేపథ్యంలో నితీశ్ సమావేశం జరుగుతుండగా వెలుపల శరద్ యాదవ్ మద్దతు దారులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.