Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

No Alliance With BJP Says Stalin

By   /  November 9, 2017  /  Comments Off on No Alliance With BJP Says Stalin

    Print       Email

బీజేపీతో కలిసేది లేదు: స్టాలిన్

 

InCorpTaxAct
Suvidha

 

ఈ మద్య తమిళనాడులో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన డీఎంకే అధినేత కరుణానిధిని ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ విషయం కాస్త తమిళనాడులో రాజకీయ చర్చకు దారితీయడం తెలిసిందే. తమిళనాడులో గత కొంత కాలంగా రాజకీయాలు ఏ రేంజ్ లో వేడెక్కిపోతున్నాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో మోడీ డీఎంకే అధినేత కరుణానిధిని కలవడంతో ఆ పార్టీ బిజెపితో పొత్తు ఏమైనా కలుస్తుందా అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
మధురైలో నిర్వహించిన బ్లాక్‌ డే నిరసనల్లో స్టాలిన్‌ మీడియాతో మాట్లాడుతూ.. కరుణానిధిని ప్రధాని పరామర్శిస్తున్న సమాచారం తనకు ముందుగా తెలియదని స్పష్టంచేశారు. మోదీ చెన్నైలో కరుణను కలవనున్నారని తనకు దుబాయ్‌లో ఉన్నపుడు తెలిసిందని, అక్కడి పర్యటన రద్దు చేసుకుని వచ్చానని స్టాలిన్‌ తెలిపారు. తన తండ్రితో జరిగిన భేటీలో ఎలాంటి రాజకీయ ప్రస్తావన రాలేదని, డీఎంకే పొత్తు ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదని  స్టాలిన్‌ స్పష్టం చేశారు.
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →