ట్రంప్ పై కేసులకు అవకాశం లేదట..!
అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ పై పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. తన మద్దతుదారులను హింసకు ప్రోత్సహించారని ఆరోపణలు వచ్చాయి. అయితే తాను ఎన్నికల్లో గెలిచానని అధ్యక్షుడిని అయ్యాయని డోనాల్డ్ ట్రంప్ అన్నారు. అందువల్ల తనపై కేసులు పెట్టే అవకాశం లేదని అన్నారు. అలా చేయడానికి ప్రయత్నించినా తనపై కేసులేవీ వర్తించబోవని అన్నారు. మార్చి 2016లో లూయిస్ విల్లీలో ట్రంప్ సభలో ముగ్గురు నిరసనకారులు నినాదలు చేశారు. దీంతో వారిని తరిమికొట్టాలని ట్రంప్ తన మద్దతుదారులను ఆదేశించారు.ఈ అంశంలో ముగ్గురు బాధితులు కోర్టు ఆశ్రయించారు. మొదట కేసును స్వీకరించేందుకు జడ్డీ ఒప్పుకోలేదు.
అయితే ఘటనకు సంబంధించిన వీడియోలను ఓ బాధితుడు కోర్టుకు సమర్పించాడు. ట్రంప్ మద్దతుదారు అల్విన్ బాంబెర్గర్, నిరసనకారులపై దాడికి పాల్పడ్డారని తెలిపాడు. ఇదంతా కేవలం ట్రంప్ ఆదేశాలతోనే జరిగిందని ఆరోపించారు. ఈ దాడిలో 21 సంవత్సరాల కాషియా న్వాన్ గుమా అనే కాలేజీ స్టూడెంట్ ప్లకార్డులతో నిరసన తెలుపాడని అందువల్ల దాడి జరిగిందని కోర్టుకు తెలిపారు.
లాస్ వెగాస్ లో ట్రంప్ మాట్లాడుతూ, నిరసనకారుల వైఖరిని వ్యతిరేకించారు. “నిరసనకారుడి ముఖంపై బలంగా కొట్టాలని ఉంది” అంటూ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను కూడా సాక్ష్యంగా చూపించారు. అయితే ట్రంప్ ను జనం గెలిపించారు కాబట్టి ఆయనపై కేసులు ఉండవని ట్రంప్ తరపు న్యాయవాదులు అంటున్నారు. మరి దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.