‘కాటమరాయుడు’కి ఒరిజినల్ వెర్షన్ తో పోలికే లేదట..!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ ‘కాటమరాయుడు’. ఈ మూవీకి సంబంధించి విడుదలైన అన్ని పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ విడుదలైన కాసేపటికే రికార్డు స్థాయిలో వీక్షించారు. ఇక ఈ ట్రైలర్ చిరు ఖైదీ ట్రైలర్ ని దాటుకుని అత్యధికంగా వ్యూస్ సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో పవర్ స్టార్ సరసన అందాల తార శృతిహాసన్ నటిస్తోంది.
ఈ మూవీ తమిళ సినిమాకి రీమేక్ అన్న విషయం తెలిసిందే. అయితే తెలుగు చిత్రానికి, తమిళ చిత్రానికి పోలిక ఉండదట. ఈ విషయాన్ని హీరోయిన్ శృతిహాసన్ తెలిపింది. ‘కాటమరాయుడు’ మూవీలో చాలా మార్పు చేర్పులు జరిగాయని తెలిపింది. తనకు ఫస్ట్ హిట్ పవన్ కల్యాణ్ చిత్రంతోనే వచ్చిందని చెప్పుకొచ్చింది. మరో హిట్ కూడా తన ఖాతాలో పడుతుందని చెబుతోంది. అభిమానులతో పాటు తాను కూడా ఈ మూవీని థియేటర్ లో చూడాలని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లుగా ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.