చంద్రబాబుతో శతృత్వం ఎందుకుంటుంది: పురంధేశ్వరి
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ అగ్రనేతలకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలువురు బీజేపీ నేతలు కూడా తమ వ్యక్తిగత అభిప్రాయం అంటూ పురంధేశ్వరికి ఇన్ డైరెక్ట్ గా మద్దతు తెలిపినట్లు మాట్లాడారు. మరోవైపు.. విపక్ష వైసీపీ ఈ అంశంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు ఎక్కుపెడుతోంది. ఇందులో భాగంగా హస్తినలో జాతీయ స్థాయి నేతలను కలిసింది.ఇలా పురంధేశ్వరి లేఖ కాస్తా రాజకీయ వర్గాల్లో కాక పుట్టించింది.
ఇదిలాఉంటే చంద్రబాబు మీద తనకు కోపం ఎందుకు ఉంటుందని పురంధేశ్వరి అన్నారు. ఈ మధ్య ఆమె ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుతో తనకు ఎలాంటి శతృత్వం లేదని అన్నారు. బాబుతో తనకు కేవలం భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. గతంలో తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. ఆయన్ను స్పూర్తిగా తీసుకుని ఏపీలో జరిగిన ఫిరాయింపులపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు లేఖ రాశానని అన్నారు. తన లేఖపై విమర్శలు చేయడంపై స్పందించిన ఆమె.. ఈ విషయాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.