Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

No Defense, Keep Attacking: Shah to AP BJP

By   /  February 2, 2018  /  Comments Off on No Defense, Keep Attacking: Shah to AP BJP

    Print       Email

టీడీపీపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు..!

InCorpTaxAct
Suvidha

 

 

 

 

నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన 2018 బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి తీవ్ర అన్యాయం జరిగిందని కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలకు ఆ పార్టీ చీఫ్ అమిత్ షా కొన్ని సూచనలు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని, వారిని చూసి భయపడ వద్దని ఏపికి చేయాల్సినవన్నీ కేంద్ర ప్రభుత్వం చేస్తూనే ఉందని అన్నారు.

ఇక పలువురు పార్టీ నేతలు అమిత్ షాను కలవగా, టీడీపీ అనుసరిస్తున్న వైఖరి గురించి నేతలు ఆయనకు ఫిర్యాదు చేశారు. ఏపీ అడిగినవన్నీ ఇస్తూనే ఉన్నామని చెప్పిన అమిత్, పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని, టీడీపీ విమర్శలకు దీటైన జవాబులు ఇవ్వాలని సూచించారు. ఇక అసెంబ్లీ సీట్లను పెంచే విషయంలోనూ బీజేపీ నేతల అభిప్రాయాన్ని అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. తాను త్వరలోనే రాష్ట్రంలో పర్యటిస్తానని, ఈదఫా రాయలసీమలో తన పర్యటన ఉంటుందన్న సంకేతాలను ఇచ్చారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →