Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

No Family Planning.. should more than one child..

By   /  March 20, 2016  /  Comments Off on No Family Planning.. should more than one child..

    Print       Email

chandrababu new

ఫ్యామిలి ప్లానింగ్ వద్దు.. ఒకరి కంటే ఎక్కువమందే ముద్దు..
ప్రస్తుత తరం ఫ్యామిలీ ప్లానింగ్ పద్ధతులను పక్కన పెట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని చెప్పారు. విజయవాడలో క్రీడా అవగాహనా సదస్సులో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా జనాభా సంఖ్య తగ్గుతోందన్నారు.అలాగే ఏపీలో కూడా జనాభా పెరగాల్సిన అవసరముందన్నారు. స్కూల్ స్థాయిలో క్రీడల అభివృద్ధి కోసం కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలిపారు. జూన్‌ నాటికి క్రీడలపై అవగాహన క్యాలెండర్‌ రూపొందిస్తామన్నారు. రానున్న రోజుల్లో ఏపీని.. క్రీడాంద్రప్రదేశ్ గా మారుస్తామన్నారు.దీనికి వ్యాయమ ఉపాధ్యాయులు సహకరించాలన్నారు.

InCorpTaxAct
Suvidha

క్రీడారంగంలో మార్పులు తీసుకు వస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. భావితరాల భవిష్యత్తు కోసం అందరం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.దీనికి వ్యాయమ ఉపాధ్యాయులు సహకరించాలని కోరారు. మెదటిసారిగా ఫిజికల్ లిటరసీ పై మాట్లాడుకుంటున్నామని తెలిపారు. దీనికి కృషి చేసిన గోపీచంద్‌ను ముఖ్యమంత్రి అభినందించారు. రెండు నెలల కిందట చంద్రబాబు కాపు రుణమేళా సభలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జనన మరణాల రేటు సమానంగా ఉందన్నారు. దీంతో రాబోయే కాలంలో యువత సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. దీనిపై చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆశక్తిని కలిగిస్తున్నాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →