నో ఫోర్స్ .. ఓన్లీ సిక్సర్స్..
టీ20ల్లో పరుగుల వరద పారడం కామన్. ముఖ్యంగా బౌండరీలు కొట్టకుండా ఓవర్ పూర్తికాదు. తక్కువ ఓవర్లలో స్కోరును పరిగెత్తించాలంటే సిక్సులు, ఫోర్లు బాదాల్సిందే. ఇదే ఈ ఫార్మాట్ లో బ్యాట్స్ మెన్ లు ఆలోచించే విధానం. అయితే ఓ ముగ్గురు బ్యాట్స్ మెన్లు మాత్రం ఫోర్లు కొట్టకుండానే ఇన్నింగ్స్ ఆడేశారు. ఇంతకీ వారెవరు..? ఆ ముగ్గురు మరోవరో కాదు.. నితీశ్ రాణా, డేవిడ్ మిల్లర్, డ్వేన్ బ్రావో.
ముంబై ఇండియన్ తరపున ఆడుతున్న నితీశ్ రాణా ఐపీఎల్ లో ఫుల్ జోష్ లో ఉన్నాడు. భారీ ఇన్నింగ్స్ ఆడి తన జట్టును విజయపథంలో నిలబెడుతున్నాడు. ఇండోర్ వేదికగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఇచ్చిన టార్గెట్ 199 రన్స్ ని ఛేదించే క్రమంలో నితీశ్ (62 నాటౌట్; 34 బంతుల్లో 7×6)గా నిలిచాడు. ఏకంగా ఏడు సిక్సర్లు బాదేశాడు. అయితే ఫోర్లు కొట్టకుండానే హాఫ్ సెంచరీ చేసేశాడు.దీంతో ముంబై 15.3 ఓవర్లకే విజయం సాధించింది.
అలాగే చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్ మెన్ డ్వేన్ బ్రావో సింపుల్ గా సిక్సర్లు కొడుతూనే 43 రన్స్ తో అజేయంగా నిలిచాడు. దక్కన్ ఛార్జర్స్‌తో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 193/6 రన్స్ చేసింది. చివరిగా వచ్చిన బ్రావో 18 బంతుల్లో 5 సిక్సర్ల బాదేసి 42 రన్స్ చేశాడు. దక్కన్ ఛార్జర్స్ 119 పరుగులకే చేతులెత్తేయడంతో చెన్నై 74 రన్స్ తో విజయం సాధించింది.
ఇక కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ మిల్లర్ (51 నాటౌట్; 19 బంతుల్లో 6×6) ఆరు సిక్సర్లు కొట్టి హాఫ్ సెంచరీ సాధించాడు. రాజస్థాన్ రాయల్స్ ఇచ్చిన 192 రన్స్ టార్గెట్ ని అధికమించేందుకు రెచ్చిపోయి ఆడాడు. మరో బ్యాట్స్ మెన్ మాక్స్వెల్ (89; 45 బంతుల్లో 8×4, 6×6)తో కలిసి తన జట్టుకు విజయాన్ని అందించాడు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.