Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

No hike in rail fares; increase in quota for senior citizens,women..

By   /  February 25, 2016  /  Comments Off on No hike in rail fares; increase in quota for senior citizens,women..

    Print       Email

Suresh-Prabhu1

రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి సురేశ్ ప్రభు..

InCorpTaxAct
Suvidha

 

కేంద్ర రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు గురువారం మధ్యాహ్నం 12గంటల సమయంలో లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దేశ ప్రజల అవసరాలను దృష్ట్యిలో పెట్టుకుని బడ్జెట్ ని తయారు చేశామన్నారు. రైల్వే శాఖ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటోందన్నారు. అయితే వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడేది లేదన్నారు. ఈ సందర్భంగా ఆయన మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ మాటల్ని ఉదహరించారు. కష్టాలు వస్తూనే ఉంటాయి.. ముందుకు సాగుతూనే ఉంటాం.. అని సురేశ్ ప్రభు వ్యాఖ్యానించారు. మన ప్రయాణంలో మార్పునకు ఈ బడ్జెట్‌ సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. దేశంలోని మిలియన్ల కొద్దీ సామాన్యులను తాకుతూ తమ ప్రయాణం సాగుతుందన్నారు.

రైల్వే బడ్జెట్‌ ముఖ్యాంశాలు

* 2008-14 నుంచి 8 శాతంగానే రైల్వే వృద్ధి అంచనాలు
* గతేడాది 2 రెట్లు ఎక్కువ వృద్ధి సాధించాం ..
* లక్షా 21వేల కోట్ల రూపాయలతో రైల్వే బడ్జెట్‌ రూపకల్పన..
* భారతీయులంతా గర్వపడే రైల్వే వ్యవస్థను అందింస్తాం..
* సేవల నుంచి సౌకర్యాల వరకు అన్ని విభాగాల్లో రైల్వే వ్యవస్థ ముందంజలో ఉండేలా చూడటం..
* భద్రతా ప్రమాణాల పెంపునకు అత్యాధునిక సాంకేతికత వినియోగం..
* కేవలం రూపాయి ఖర్చుతో 5 రూపాయల వృద్ధి ..

* రాబడి పెంపుదల కోసం సంప్రదాయ ఆలోచనా విధానాలకు స్వస్తి.. కొత్త ఆలోచనలకు శ్రీకారం..
* చార్జీలు పెంపుదలకు బదులు.. ఆదాయం పెరగడానికి ఇతర మార్గాలపై దృష్టి కేంద్రీకరణ..
* ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ.. భారీ ప్రయోజనం పొందేలా చర్యలు..
* ఇంధన సేకరణ వ్యయాన్ని గణనీయంగా తగ్గించగలగడం..
* డీజిల్‌, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో ఈ ఏడాది కూడా భారీగా ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం.
* గతేడాది బడ్జెట్‌లో ప్రకటించిన 139 అంశాల్లో కార్యాచరణ ప్రారంభించాం..
* వచ్చే ఐదేళ్లలో రూ.1.5లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఎల్‌ఐసీ అంగీకారం..
* రోజుకు 7 కి.మీ. రైల్వే లైన్ల నిర్మాణానికి చర్యలు
* 2017-18లో 9వేల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా సాగుతాం..
* వచ్చే ఏడాది 2వేల కి.మీ. రైల్వే మార్గాలను విద్యుదీకరించేందుకు చర్యలు..

* ఆదాయ లక్ష్యం రూ. 1,84,820కోట్లు

* 2016-17 సంవత్సరానికి రైల్వేలు 1,84,820 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయన్న రైల్వే మంత్రి సురేష్‌ ప్రభు

* 44 కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంవోయూలు..
* 5,300 కి.మీ. 44 కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి ఎంవోయూలు..
* ఇంటర్నల్ ఆడిట్‌ విభాగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు..
* ఈ ఏడాది మరో 100కు పైగా రైళ్లలో ఆన్‌బోర్డ్‌ హౌస్‌కీపింగ్‌ సేవలకు శ్రీకారం..
* 2015-16లో ఇంధన ఆదాతో రూ.8,720కోట్లు మిగులు..
* ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలోకి డిస్పోజబుల్‌ బెడ్‌షీట్లు..

రైల్వే 2020 లక్ష్యాలు

* తెలంగాణ సర్కారు భాగస్వామ్యంతో హైదరాబాద్‌ సబర్బన్‌ నెట్‌వర్క్‌ విస్తృతికి చర్యలు..
* పాలు, అత్యవసర మందులు కూడా ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు..
* టికెట్‌ బుకింగ్‌ సమయంలోనే ప్రయాణ బీమా అందించేందుకు బీమా సంస్థలతో ఒప్పందం..
* రైల్వే స్టేషన్లలో పిల్లల కోసం బేబీఫుడ్‌, వేడిపాలు, వేడి నీళ్లు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు..
* పెండింగ్‌ ప్రాజెక్టులు మూడేళ్లలో పూర్తి అయ్యేలా చర్యలు..

* ఆన్‌డిమాండ్‌పై రైల్వే రిజర్వేషన్లు అందించేలా చర్యలు..
* రవాణా రైల్వే టైంటేబుల్‌ను అమలయ్యేలా చూడడం..
* అత్యున్నత సాంకేతికతతో భద్రతను మెరుగుపర్చడం..
* అన్ని రైల్వేగేట్లు దగ్గర కాపలా ఉండేలా చర్యలు..
* సమయపాలనను పాటించేలా చూడటం..
* రవాణా రైళ్ల సగటు వేగాన్ని 50 కిలోమీటర్లకు పెంచడం..
* మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేగం 80 కిలోమీటర్లకు పెంచడం..
* స్వర్ణ చతుర్భుజి మార్గంలో సెమీ హైస్పీడ్‌ రైళ్లను ఉపయోగించడం..
* మానవ వ్యర్థాలను నేరుగా బయటకు పంపడాన్ని అరికట్టడం..
*2017-18 నాటిని రోజుకు 13 కిలోమీటర్ల బ్రాడ్‌గేజీలను పూర్తి చేయడం లక్ష్యం..
* దీనిని 2018-19నాటికి 19 కిలోమీటర్లకు పెంచుతాం..
* 2017-18లో 9కోట్ల మానవ పనిదినాలు, 2018-19లో 14కోట్ల పనిదినాలను సృష్టిస్తాం..
* రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కొత్త ప్రాజెక్టులు..
* ప్రయాణికుల నుంచి నేరుగా సలహాల కోసం ప్రత్యేక ఐవీఆర్‌ఎస్‌ నంబర్‌ ఏర్పాటు..
* ప్రతి రైలులో వృద్ధులు, మహిళల కోసం 120 లోయర్‌ బెర్తులు ఏర్పాటు..
* పీపీపీ విధానంలో 400 స్టేషన్ల ఆధునికీకరణకు చర్యలు..
* వచ్చే ఐదేళ్లలో రైల్వేల ఆధునికీకరణకు రూ.8.5 లక్షల కోట్లు కేటాయింపులు..
* పాత్రికేయులకు రాయితీపాస్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే సౌకర్యం
* ఈశాన్య భారతాన్ని మిగిలిన ప్రాంతాలతో కలపడానికి ప్రాధాన్యం ఇవ్వడం..
* అసొమ్‌లోని లుమ్‌డిండ్‌-సిల్‌చార్‌ సెక్షన్‌ను ప్రారంభించి బరాక్‌ ప్రాంతాన్ని దేశంతో కలిపేందుకు చర్యలు..
* అన్ని మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌లలో ప్రయాణికుల వినోదం కోసం ఎఫ్‌ఎం సేవలు..

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →