రైల్వే జోన్ వస్తుందా? రాదా?
విశాఖపట్నంకు సంబంధించి రైల్వే జోన్ ఇన్ని రోజులు వస్తుందా? రాదా? అనే అనుమానం ఉన్నా రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లాడు కాబట్టి ఖచ్చితంగా వస్తుందని అంతా భావించారు. కానీ ప్రస్తుత పరిస్థితులు కానీ.. సురేష్ ప్రభు వ్యాఖ్యలు కానీ చూస్తా ఉంటే మాత్రం రైల్వే జోన్ పై ఆశలు సన్నగిల్లుతున్నాయి. తాజాగా రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి.. ఆయనతో భేటీ అయ్యారు. ఆ తర్వాత బాబు మాట్లాడుతూ.. విశాఖకు రైల్వే జోన్ విషయమైన సురేశ్ ప్రభుతో మాట్లాడానని.. ఈ అంశాన్ని పరిశీలిస్తానని కేంద్రమంత్రి తనతో చెప్పినట్లుగా బాబు పేర్కొనటం విశేషం. ఓపక్క విభజన చట్టంలో రైల్వే జోన్ ను తప్పనిసరిగా ఏర్పాటు చేయమని చెప్పలేదని.. ఈ విషయాన్ని పరిశీలించమని మాత్రమే చెప్పిందని సురేశ్ ప్రభు పేర్కొనటం చూస్తే.. రైల్వే మంత్రిని ఎంపిక చేశామన్న సంతోషాన్ని ఏపీ ప్రజలకు ఆయన ఒక్కరోజు మాత్రమే మిగిల్చినట్లుగా కనిపిస్తోందే.
ఇదిలా ఉంటే శనివారం తిరుమల శ్రీవారిని దర్శంచుకున్న సురేష్ ప్రభు అనంతరం తిరుపతి స్టేషన్ నుంచి ఆన్లైన్ ద్వారా తిరుచానూర్ క్రాసింగ్ రైల్వే స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.10 కోట్లతో తిరుచానూరు క్రాసింగ్ రైల్వేస్టేషన్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తిరుపతి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించటం ఆనందంగా ఉందన్నారు. ఏపీ అభివృద్ధికి రైల్వేశాఖ ద్వారా కావాల్సిన అన్ని అవసరాలు తీరుస్తామని స్పష్టం చేశారు. రోజూ లక్షమంది ప్రయాణికులు వచ్చే తిరుపతి రైల్వేస్టేషన్ అభివృద్ధికి స్పష్టమైన ప్రణాళికతో చర్యలు చేపడతామని వివరించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.