Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

స‌చిన్ ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవ‌ట‌!

By   /  April 26, 2016  /  Comments Off on స‌చిన్ ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవ‌ట‌!

    Print       Email

sachin-tendulkar1క్రికెట్ రారాజు స‌చిన్ టెండూల్క‌ర్ ప్ర‌స్తుత క్రికెట‌ర్ల‌కంటే అత్యంత ధ‌న‌వంతుడు. తాను చేసే ప్ర‌క‌ట‌న‌ల్లోనే కోట్ల రూపాయ‌లు డ‌బ్బులు వ‌స్తుంటాయి. అలాంటి వ్య‌క్తి ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవంటే ఎవ‌రైనా న‌మ్ముతారా? అవును నిజం. స‌చినే చెప్ప‌డు అత‌ని ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవ‌ని.. అయితే ఇప్పుడు కాద‌ట‌.. స‌చిన్‌కు 12 ఏళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడు. ముంబై నుంచి అండర్ 15 తరపున ఎంపికైన సమయంలో సచిన్ వయసు 12 సంవత్సరాలు. అదే సందర్భంలో పూణేలో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. దీంతో కొంత డబ్బు తీసుకుని పూణే వెళ్తే అక్కడ అప్పుడు వానపడుతోంది. తొలి మ్యాచ్‌లో నాలుగు పరుగులు మాత్రమే చేసి రనౌట్ అయ్యాక బాధతో డ్రెస్సింగ్ రూంకు వెళ్లాడట. బాధ తట్టుకోలేక ఏడ్చేశాడట. ఆ తర్వాత రోజంతా ఏం చేయాలో తోచక బయటకు వెళ్లి సినిమా చూడటంతో పాటు మిగతా చిన్న చిన్న సరదాలకు ఉన్నదంతా ఖర్చు చేశాడు. ఆ తర్వాత రైలెక్కి ముంబై వచ్చే సరికి ఆయన చేతిలో పైసా కూడా మిగల్లేదు. చేతిలో రెండు పెద్ద సంచులున్నాయి. దాదర్ స్టేషన్ దగ్గర దిగి శివాజీ పార్క్ వరకూ కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చిందని సచిన్ వెల్లడించారు. డీజీ బ్యాంక్ ప్రారంభోత్స‌వంలో సచిన్ తన పాత స్మృతులను నెమ‌రేసుకున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →