Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

No one can predict Pawan Kalyan

By   /  August 28, 2016  /  Comments Off on No one can predict Pawan Kalyan

    Print       Email

pawan kalyan about speech in tirupati 2ప‌వ‌న్ రూటే స‌ప‌రేటు!

 

InCorpTaxAct
Suvidha

 

 

చాలా రోజుల త‌ర్వాత ప్ర‌జ‌ల మ‌ధ్య‌లోకి వ‌చ్చిన జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తిరుప‌తిలో బ‌హిరంగ స‌భ నిర్వ‌హించారు. ఈ స‌భ నుద్దేశించి ప‌వ‌న్ ఏమి మాట్లాడాతారా? అని అంద‌రూ ఎదురు చూశారు. అయితే ప‌వ‌న్ ప్ర‌సంగం విన్న చాలా మంది ప్ర‌జ‌లు, రాజ‌కీయ నాయ‌కులు మాత్రం అంటున్న మాట ఒక్క‌టే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎవ‌రీ అర్థం కాడ‌ని, ఆయ‌న రూటే స‌ప‌రేటు అని అంటున్నారు. ఎందుక‌లా అంటున్నారో తెలుసుకోవాలంటే వివ‌రాల్లోకి వెళ్లాలి… “విల్లునుంచి వదిలిన బాణం.. నోటినుంచి వచ్చిన మాటా వెనక్కి తీసుకోలేం. అందుకే నేను ఏమి మాట్లాడినా ఒకటికి రెండు సార్లు ఆలోచించే మాట్లాడతాను“ అంటూ తిరుప‌తి స‌భా వేదిక నుంచి త‌న ప్ర‌సంగంగాన్ని ప్రారంభించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ చాలా విష‌యాలే మ‌ట్లాడారు.  ప్రత్యేక హోదా మీద మూడు దశల్లో పోరాటం చేస్తానని ప్రకటించిన పవన్ కల్యాణ్.. అందులో మొదటి దశలోని మొదటి పార్ట్ కు ముహుర్తం కూడా వెల్లడించేశారు. సెప్టెంబరు 9న కాకినాడలో తాను సభ నిర్వహించనున్నట్లుగా వెల్లడించారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తిరుపతిలో సభను ఎందుకు పెట్టానో తెలుసా అంటూ కారణం చెప్పేసిన పవన్ కల్యాణ్.. ఇంత అకస్మాత్తుగా సభ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందన్న విషయానికి మాత్రం సమాధానం ఇవ్వకపోవటం కాస్తంత వెలితిగా ఉందనే చెప్పాలి. అదొక్కటే కాదు.. మొన్నటికి మొన్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తన ఇంటికి వచ్చి వెళ్లిన విషయాన్ని ప్రస్తావించిన పవన్ కల్యాణ్.. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడానని.. ఆ సందర్భంగా ప్రత్యేక హోదా అంశాన్ని ఎంపీలు.. మంత్రులు.. ఎమ్మెల్యేలు చూడాలని చెప్పానని.. తాను ఒక్కడిని ఏమీ చేయలేనన్న మాటకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎందుకొచ్చిందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు.  ఏపీకి అన్యాయం చేసిన  విషయంలో కాంగ్రెస్ కు.. బీజేపీకి మధ్య తేడా లేదన్నట్లుగా తేల్చేసిన పవన్ కల్యాణ్.. ఈ రెండు పార్టీలకు తప్ప వేరేది ఏమీ లేని నేపథ్యంలోనే తాను బీజేపీకి మద్దతు పలికిన విషయాన్నిచెప్పారు.

మ‌రి ఇప్పుడు ప్రత్యామ్నాయం లేని జాతీయ పార్టీ మీద పోరాటానికి ఎందుకు దిగుతున్నట్లు..? ఏపీ అధికారపక్షంపై విమర్శలు చేసే సందర్భంగా ఒకటికి రెండుసార్లు సర్ది చెప్పినట్లుగా మాటలు చెప్పాల్సిన అవసరం ఏమిటన్నది ఎంతకూ అర్థం అర్థం కావ‌డం క‌లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ కల్యాణ్ బహిరంగ సభకు సంబంధించి చాలానే మాటలు చెప్పాల్సి ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గతంలో  మౌనంగా ఉండి అనేక ప్రశ్నలు మదిలో మెదిలేలా చేసిన పవన్..  ఇప్పుడు నోరు విప్పి అంతకుమించిన సందేహాలు కలిగేలా చేశారనటంలో ఎలాంటి సందేహం లేదు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →