Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

No one can understand AP Politics – Adhinarayana Reddy

By   /  June 18, 2016  /  Comments Off on No one can understand AP Politics – Adhinarayana Reddy

    Print       Email

Adinarayana reddyనాయ‌కుల‌కు క్యాడ‌ర్ షాక్‌

 

InCorpTaxAct
Suvidha

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు నాయ‌కులు అర్థం కావ‌డం లేదు. నాయ‌కుల‌తో పాటు క్యాడ‌ర్ కూడా వ‌స్తుంద‌ని అనుకుంటున్న నాయ‌కుల‌కు క్యాడ‌ర్ షాకిస్తోంది. మీరు మీ స్వ‌లాభం కోసం పార్టీ మారితే మేము మీ వెంట రామ‌ని చెబుతోంది. నాయ‌కుడి ఒత్తిడితో కొంత‌మంది నాయ‌కుడి వెంట వెళ్లినా మ‌ళ్లీ కొద్ది రోజులుకే తిరిగి వ‌స్తున్నారు. తాజాగా క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగులో కూడా అదే జ‌రిగింది. జ‌మ్మ‌ల‌మ‌డుగుఎమ్మెల్యే ఆది నారాయ‌ణ‌రెడ్డి వ‌ర్గానికి చెందిన 100 కుటుంబాలు మళ్లీ వైసీపీలో చేరడం కడప జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమక్షంలో వీరంతా వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఇదే సమయంలో జమ్మలమడుగు మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి సంగరయ్య వైసీపీలో చేరారు. తామంతా ఇకపై వైసీపీ అధినేత జగన్ కు – అవినాష్ రెడ్డికి అండగా ఉంటామని పార్టీలో చేరిన కుటుంబాలు వెల్లడించాయి.
ప్రజలకు ఏ మాత్రమూ ఉపయోగం లేని చంద్రబాబు పాలనతో వీరంతా అభివృద్ధికి దూరంగా ఉన్నారని ఎన్ని పథకాలు ఉన్నా వీరి దరికి చేరలేదని ఈ సందర్భంగా అవినాష్ వ్యాఖ్యానించారు. తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఫిరాయిస్తున్నా – ప్రజల అభిమానం చెక్కు చెదరలేదని అన్నారు. అయితే ఇది మంచిప‌రిణామ‌మే అని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఏది ఏమైనా నాయ‌కులు ఇలా షాక్‌లు ఇస్తున్న క్యాడ‌ర్‌ను చూసి ఇక పార్టీ మారాలంటే నాయ‌కులు ఆలోచ‌న చేయాల్సిన ప‌రిస్థితి నెల‌కొంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →