Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

No one supports Babu in Delhi

By   /  May 18, 2016  /  Comments Off on No one supports Babu in Delhi

    Print       Email

Chandrababu1పాపం..బాబు!

 

InCorpTaxAct
Suvidha

 

 

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుకు కాలం క‌లిసి రావ‌డం లేదా? ఆయ‌న బంగారం ప‌ట్టుకుంటున్నా మ‌ట్టి అవుతోందా? ఒక‌ప్పుడు కేంద్రంలో చ‌క్రం తిప్పిన బాబుకే ఇప్పుడు ఢిల్లీలో ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయా? నిన్న బాబు ఆవేద‌న‌కు కూడా కార‌ణం అదేనా? అంటే అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఇదంతా కూడా బాబు స్వ‌యంకృతాప‌రాధామే అంటున్నారు. ఏ రాష్ట్ర ముఖ్య‌మంత్రికి ఇవ్వ‌నంత ప్రియారిటీ మోడీ చంద్ర‌బాబుకు ఇస్తే ఆయ‌న చేతులారా స‌క్య‌త‌ను చెడుకొట్టుకుంటున్నారంటున్నారు. చేతులు కాలాక ఆకులుప‌ట్టుకుని ఏం లాంభం లేదంటున్నారు. వివ‌రాల్లోకి వెళ్లితే నిన్న చంద్ర‌బాబు మోడీని క‌లిసిన అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ త‌న ఆవేద‌న‌ను వెల్ల‌బోసుకున్నారు. ముఖ్యమంత్రిగా ఎవరికీ లేని ఇబ్బందిని తనకే కేంద్రం ఎందుకు క‌ల్పిస్తుందో అర్థం కావ‌డం లేదంటున్నారు.  ప్రత్యేక హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందలేదని మిగతా రాష్ట్రాలకు లేని శిక్ష.. ఏపీకి మాత్రమే ఎందుకని.. తాము చేసిన తప్పేంట‌ని కేంద్రాన్ని ప్ర‌శ్నించారు.

రాష్ట్ర విభజన సక్రమంగా జరిగి ఉంటే ఈరోజు ప్రత్యేక హోదా – నిధులను అడుక్కునే పరిస్థితి వచ్చేది కాదని చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.  రాజధాని ఉంటేనే ఆర్థిక వృద్ధి జరుగుతుందని అందుకే అమరావతి నిర్మాణానికి నిధులు మంజూరుచేయాలని కోరినట్లు చెప్పారు. అన్ని రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకు రాష్ట్రానికి సాయమందించాలని మోడీని కోరినట్లు తెలిపారు.  ఏపీ – తెలంగాణ – విభజన – ఆర్థిక కష్టాలు వంటి అన్ని అంశాలను చంద్రబాబు సుదీర్ఘంగా ప్రస్తావిస్తూ ఒకింత గద్గద స్వరంతో స్పందించారు. మొత్తంగా చూసుకుంటే బాబుకు కేంద్రం నుంచి ఎలాంటి హామీ దొరికిన‌ట్లు క‌నిపించ‌లేద‌నేది స్ప‌ష్ట‌మైంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →