Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

No one understands JC Diwakar Reddy!

By   /  August 4, 2016  /  Comments Off on No one understands JC Diwakar Reddy!

    Print       Email

jc diwakar reddy 1ఎవ‌రికీ అర్థం కాని జేసీ

 

InCorpTaxAct
Suvidha

 

 

అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డిని ఎవ‌రూ అర్థం చేసుకోలేక‌పోతున్నారు. ప్ర‌తిప‌క్షాల‌ను పొగిడేస్తూ.. కొన్ని సంద‌ర్భాల్లో సొంత‌పార్టీ నేత‌ల‌ను సైతం విమ‌ర్శిస్తూ ముందుకెళ్తున్నారు. గ‌తంలో ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మా వాడే అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన జేపీ ఇప్పుడు వైసీపీ ఎంపీల‌తో క‌లిసిపోయి మ‌రో వివాదానికి తెర‌లేపారు. ఇలా ఒక్కోసారి ఒక్కోలా వ్యవహరిస్తూ ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాల వద్ధా కనిపిస్తూ స్వతంత్ర సభ్యుడిలా వ్యవహరిస్తున్న జేసీని చూపి పార్టీ నేతలంతా ఈయన్నెలా అర్థం చేసుకోవాలో అర్థం కావడం లేదంటూ తలలు పట్టుకుంటున్నారట. తాజాగా ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేతలు ధర్నా చేస్తుంటే జేసీ అక్కడ కనిపించారు. అది కూడా పక్కనే తమ పార్టీ నేతలు ధర్నా చేస్తున్నా అటువైపు వెళ్లకుండా ప్రతిపక్ష శిబిరంలో అడుగుపెట్టి సందడి చేశారు. ఫొటోలకు ఫోజులు కూడా ఇచ్చారు. ప్రత్యేక హోదా కోసం బుధవారం కూడా వైసీపీ ఎంపీలు సభలో బయట ఆందోళన కొనసాగించారు. ఉదయం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైసీపీ సభ్యులు ధర్నా చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.

ఇదే సమయంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అటుగా వచ్చారు. టీడీపీ సభ్యుడైనప్పటికి వైసీపీ ఎంపీల వద్దకు వెళ్లి కాసేపు ముచ్చట్లు పెట్టారు. వైసీపీ ఎంపీలకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ సమయంలో మీడియా ప్రతినిధులు ఫోటోలు తీసేందుకు ప్రయత్నించగా… ‘‘తీసుకోండి.. తీసుకోండి” అంటూ  ఫోటోలకు జేసీ పోజులు  కూడా ఇచ్చారు. గతంలో  వైఎస్ జగన్ కేంద్రమంత్రులను కలిసేందుకు ఢిల్లీ వచ్చిన సమయంలోనూ పార్లమెంట్ వద్దే జేసీ ఎదురుపడ్డారు. జగన్ తో కరచాలనం చేసి కుశల  ప్రశ్నలు వేశారు. జగన్ తో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. జేసీ తీరు చూస్తుంటే… ఆయన టీడీపీలో ఉన్నారో వైసీపీలో ఉన్నారో అర్థం కావ‌డం లేద‌ని తెలుగు త‌మ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →