Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

No questions about Kohinoor Diamond! It is a Gift to India

By   /  April 18, 2016  /  Comments Off on No questions about Kohinoor Diamond! It is a Gift to India

    Print       Email

diamondకానుక‌గా ఇచ్చిన కోహినూర్ వ‌జ్రాన్ని అడిగేది లేదు

 

InCorpTaxAct
Suvidha

 

భార‌త‌దేశానికి చెందిన కోహినూర్ వ‌జ్రాన్ని అడిగే ప్ర‌స‌క్తే లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. కానుక‌గా ఇచ్చింది మ‌ళ్లీ ఇవ్వ‌మ‌ని అడిగితే బాగుండ‌ద‌ని పేర్కొంది. బ్రిట‌న్‌లో ఉన్న కోహినూర్ వ‌జ్రంతో పాటు టిప్పు సుల్తాన్ క‌త్తి, ప‌లు విలువైన వ‌స్తువుల‌ను వెన‌క్కి తీసుకురావాల‌ని కోరుతూ ఆల్ ఇండియా హ్యూమ‌న్ రైట్స్ అండ్ సోష‌ల్ జ‌స్టిస్ ఫ్రంట్ నిర్వాహ‌కులు సుప్రీంకోర్టులో పిటీష‌న్ దాఖ‌లు వేసింది. ఆ పిటీష‌న్‌ను విచార‌ణ‌కు తీసుకున్న సుప్రీంకోర్టు ఈ అంశంపై కేంద్రం వైఖ‌రిని తెలియ‌జేయాల‌ని ఆదేశించింది. దీనిపై కేంద్రం స్పందిస్తూ కోహినూర్‌ వజ్రాన్ని బ్రిటిష్‌ వాళ్లు దొంగిలించలేదు, బలవంతంగా తీసుకెళ్లలేదు, దాన్ని వారికి బహుమతిగా ఇచ్చారు.. కాబట్టి వెనక్కి అడిగే ఆలోచన ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది.
దానిని పంజాబ్‌కు చెందిన మహారాజా రంజిత్‌సింగ్‌ ఈస్ట్‌ఇండియా కంపెనీకి కానుకగా ఇచ్చారని తెలిపింది. కాబట్టి కోహినూర్‌ వజ్రాన్ని వెనక్కి ఇవ్వమని అడిగే ప్రసక్తే లేదని ప్రభుత్వం పేర్కొంది. వజ్రాన్ని బ్రిటన్‌ వద్దే ఉంచుకోనివ్వమని తెలిపింది. కాగా 105 క్యారెట్ల కోహినూర్‌ వజ్రాన్ని 1850లో బ్రిటన్‌ రాణికి అందజేశారు. ఆ వజ్రం ప్రస్తుతం రాణి కిరీటంలో ఉంది. గతంలో కోహినూర్‌ వెనక్కి ఇచ్చే అంశాన్ని బ్రిటన్‌ కూడా వ్యతిరేకించింది. రాణి కిరీటంలో ఉన్న వజ్రాన్ని వెనక్కి ఇవ్వలేమని వెల్లడించింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →