హోదాపై రాజీలేదు
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీలోని నాయకులు ఒకొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. కొంతమంది మాత్రం ప్రత్యేక హోదా కావాలంటారు.. మరికొందరు ప్యాకేజీ కావాలంటారు. ప్రత్యేక హోదా కోసం రాజీలేని పోరాటం చేస్తామంటారు.. హోదా ఏమైనా సంజీవినా అంటారు. ఇలా ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారు. అధినేత చంద్రబాబు మాదిరే నాయకులు కూడా తయారయ్యారు. కాగా తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు ప్రత్యేక హోదాపై స్పందించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని, దీనిలో రాజీపడే ప్రసక్తే లేదని కళావెంకటరావు అన్నారు. ప్రస్తుతం కృష్ణా పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయని, ప్రజలకు ఎటువంటి లోటూ రాకుండా చూస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయం మరింత అభివృద్ధి జరిగేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఏ అభివృద్ధి పనులు చేపట్టినా విమర్శించడమే లక్ష్యంగా ప్రతిపక్షం పెట్టుకుందని అన్నారు.
రాష్ట్ర విభజన తరువాత నూతన రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయని, దీనితోపాటు ఆర్థికలోటు కూడా ఉందని, వీటన్నింటినీ అధికమించి రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.కాగా ఇక్కడ అర్థం కాని విషయం ఒక్కటే. అది చేస్తాం.. ఇది చేస్తాం అంటున్నారు కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని కానీ, హోదా ఇవ్వకపోతే కేంద్రంతోని మంత్రులను ఉపసంహరించుకుంటామని గానీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు చెప్పకపోవడం విశేషం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.