Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Not many AIADMK MLAs interviewed

By   /  March 24, 2016  /  Comments Off on Not many AIADMK MLAs interviewed

    Print       Email

JAYALALITHA PHOTOS, TN CM JAYALALITHA PHOTOS, AMMA PHOTOS FOR FLEX, JAYALALITHA PHOTOS FOR FLEX PRINTING, HIGH QUALITY JAYALALITHA PHOTOS, AMMA HQ PHOTOS, TAMILANDU CM AMMA PHOTOS1

ఈసారి అన్నాడీఎంకేలో కొత్త ముఖాలకు ఛాన్స్..?

InCorpTaxAct
Suvidha

 

 

తమిళనాట రాజకీయం రోజుకో రకంగా కొత్త మలుపు తిరుగుతోంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఏం ఆలోచిస్తున్నారో .. ఎలా పావులు కదుపుతున్నారో ఆ పార్టీకి చెందిన నేతలకే అర్ధం కావడం లేదట. ముఖ్యంగా జయ.. తన పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకే షాక్ ఇస్తున్నారట. మే నెలలో జరగనున్న ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక కోసం ఆమె కసరత్తు చేస్తున్నారు. ఈ సారి కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారట. సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఇంటర్వ్యూలకు పిలవకపోవంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లు అయింది.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే తరపున పోటీబడేందుకు 234 సీట్లకు గాను ఏకంగా 17 వేల దరఖాస్తులు వచ్చాయి. దీంతో వీరిని ఫిల్డర్ చేసి ఒక్కో సెగ్మెంట్‌కు ముగ్గురు చొప్పున ఎంపికచేసే బాధ్యతలను ఆయా జిల్లాల ప్రధాన కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించారు. అలాగే, ఇంటెలిజెన్స్‌, ప్రైవేటు ఏజెన్సీలు కూడా విజయం సాధించే సత్తా వున్న అభ్యర్థుల లిస్ట్ ను రెడీ చేస్తున్నాని సమాచారం.
ఇక., అభ్యర్ధుల ఎంపికను ఫస్ట్ ఫేజ్ లో సీఎం స్టార్ట్ చేశారు. తొలిదశలో ఈనెల ఆరో తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయితే అప్పుడు కేవలం ఆరుగురు అభ్యర్థులు మాత్ర మే పాల్గొన్నారు. ఈ పరిస్థితుల్లో మంగళ వారం నుంచి ఈ ఇంటర్వ్యూలు తిరిగి ప్రారంభమయ్యాయి. 22వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు కన్యాకుమారి, తూత్తుక్కుడి, తిరునెల్వేలి, తంజావూరు జిల్లాలకు చెందిన అభ్యర్థులను పిలిచి వివరాలు తీసుకున్నారు. సాయంత్రం 3 గంటలకు కాంచీపురం, తిరు వళ్ళూరు, వేలూరు జిల్లాలకు చెందిన అభ్య ర్థులతో ఇంటర్వ్యూలు చేపట్టారు. ఈ జిల్లాల్లో ఏ ఒక్కరు కూడా సిట్టింగ్‌ ఎమ్మెల్యే లు లేక పోవడం గమనార్హం. దీంతో తమకు మళ్ళీ అవకాశం దక్కుతుంతో లేదోనన్న భయం వారిని కలవరల పెడుతోంది.

ఇక.. మంగళవారం జరిగిన ఇంటర్వ్యూలలో కనీసం ఒక్క సిట్టింగ్‌ ఎమ్మెల్యేను కూడా ముఖ్యమంత్రి జయలలిత ఆహ్వానించక పోవడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తం 101 మందిని ఇంటర్వ్యూలకు ఆహ్వానించారు. వారిలో నుంచి 65 మంది వివరాల సేకరించారు. వీరిలో కన్యాకుమారి స్థానంకు విజయకుమార్‌, నాగర్‌కోయిల్‌కు భారతి శాంసన్‌, కుళచ్చల్‌కు జేవియర్‌ మనోహర్‌, పద్మనాభపురానికి మ్యాధ్యూస్‌, కిళ్ళియూరుకు మేరి కమలా, పరమక్కుడికి ముత్తయ్యా, బాలుస్వామి, బాలామణి, తంజావూరుకు స్వామినాథన్‌, తిరువళ్ళూరుకు బలరామన్‌, ఆవడికి దీనదయాళన్‌లను ఆహ్వానించారు. దీంతో ఇంటర్వ్యూలు జరిగిన స్థానాలన్నింటి లో పోటీ చేసే అవకాశాన్ని కొత్తవారికే ఇచ్చే సూచనలు ఉన్నట్టు అన్నాడీఎంకే వర్గాలు భావిస్తున్నాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →