Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Not One Notification From AP!

By   /  April 28, 2016  /  Comments Off on Not One Notification From AP!

    Print       Email

chandrababuఆలూ లేదు.. సూలూ లేదు..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ్య‌వ‌హార శైలి చూస్తుంటే మాట‌లు కోట‌లు దాటుతున్నాయి కానీ.. చేత‌లు గ‌డ‌ప దాట‌లేదు అన్న‌ట్లుగా ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చి దాదాపు రెండు సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వం నుంచి ఒక్క నోటిఫికేష‌న్ లేదు. అంతేకాదు ఎన్నిక‌ల ముందు ఇంటికో ఉద్యోగం అని, నిరుద్యోగుల‌కు ఉద్యోగం వ‌ర‌కు రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని చెప్పి మేనిఫెస్టోలో పేర్కొన్నా చంద్ర‌బాబు అది అమ‌లు చేయ‌డం లేదు.

InCorpTaxAct
Suvidha

రైతుల రుణాలు.. స‌ర్కార్ ప‌థ‌కాలు నీరుగారి పోతున్న త‌రుణంలోకూడా చంద్ర‌బాబు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌కుండా కొత్త హామీలు ఇస్తున్నాడు. ప్ర‌పంచం మ‌న‌వైపే చూస్తోంద‌ని, రాష్ట్రానికి భారీ ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తున్నాయ‌ని, ల‌క్ష‌ల ఉద్యోగాలు వ‌స్తాయంటు ఊద‌ర‌గొట్టు ప్ర‌సంగాలు చేస్తున్నాడు. తాజాగా చంద్ర‌బాబు మ‌రికొన్ని వాగ్దానాలు ఇచ్చారు.
విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్లతో విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని, ఫైబర్‌ గ్రిడ్‌ పూర్తిచేసి ఊరంతా వైఫై తీసుకొస్తామని చంద్రబాబు స్ఫష్టం చేశారు. ఉద్యోగ రథం, జాబ్స్ డైలాగ్‌ను గురువారం విజ‌య‌వాడ‌లో బాబు ప్రారంభించారు. వీటితో పాటుగా దేశంలోనే మొదటి మొబైల్‌ బేస్డ్‌ నియామకసంస్థను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉచిత సేవలు అందించనున్న ఉద్యోగ రథం, జాబ్స్‌ డైలాగ్‌ వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ప్రతి జిల్లాకో ఉద్యోగ రథాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. విభజన సమస్యలున్నా రాష్ట్రంలో వనరులకు కొరత లేదని, ఎఫ్‌డీఐలను ఆకర్షించడంలో ఏపీ మూడోస్థానంలో ఉందని ఆయన తెలిపారు. శ్రీసిటీతో వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. అయితే చంద్ర‌బాబు హామీలు వ‌ట్టి నీటి మూట‌లే అని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నాయి. మాట‌లు క‌ట్టి పెట్టి చేతుల్లో చూపించాల‌ని సూచిస్తున్నాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →