అధికారులకు బాబు ర్యాంకులు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాగా పనిచేసే అధికారులకు ర్యాంకులు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే చెప్పారు. పుష్కరాల పనుల పురోగతిపై సిఎం 571 మంది అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పుష్కర పనుల్లో ఎక్కడ కూడా ఎటువంటి లోపం జరగకూడదని హెచ్చరించారు. మైక్టోసాఫ్ట్ మాడ్యూల్ టెక్నాలజీని వినియోగించుకో వాలని సూచించారు. పనుల్లో, సేవల్లో లోపాలున్నట్లు ఏ శాఖపైన కూడా ఫిర్యాదులు రాకూడదన్నారు. అధికారులు తమ పరిధిల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని, అందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు. జరుగుతున్న ఏర్పాట్లపై తాను ప్రతీ రోజూ టెలికాన్పరెన్స్ తీసుకుంటానని కూడా తెలిపారు. యాత్రీకుల రద్దీ అధికంగా ఉండే అన్నీ ఘాట్ల వద్ద చంద్రన్న సంచార వైద్యశాల ఏర్పాటు చేయాలని తెలిపారు. అత్యవ సర మందులు, వైద్యం అందుబాటులో ఉండాలని గట్టిగా చెప్పారు. లక్షాలాదిమంది యాత్రీకులు వచ్చే పుష్కరాల సందర్భంగా పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉండాలన్నారు. ఒక్క కాగితం ముక్క కూడా రోడ్లపై కనిపించకూడదని చెప్పారు.
పారిశుధ్య నిర్వహణ మెరుగుపరచాలని తెలిపారు. బారికేడింగ్ పకడ్బందీగా జరగాలన్నారు. ఎక్కడ కూడా తొక్కిసలాటకు అవకాశం ఇవ్వవద్దని సిఎం చెప్పారు. ఘాట్ల పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, సుందరీకరణ పనులు కూడా జాగ్రత్తగా చేయాలన్నారు. సముద్రంలోకి వృధాగా నీటిని పోనీయరాద న్నారు. నీటి విడుదలపై జలవనరుల శాఖ సిద్ధం చేసుకున్న పుష్కర ప్రణా ళికను పక్కాగా అధికారులు అమలు చేయాలన్నారు. ఆలమట్టి, జూరాల నుండి ఇన్ఫ్లో వస్తోందని, అనీ రిజర్వాయర్లు నీటితో నింపుకోవాలని సూచించారు. పుష్కరాలకు నీటి నిర్వహణ సక్రమంగా చేసుకుంటే నీటి కొరత ఉండదన్నారు. పుష్కర ఏర్పాట్లలో ప్రజల్లో సంతృప్తి నెలకొనాలని, ఏర్పాట్లు ఇంత బాగు న్నాయా అని ప్రజలందరూ ఆశ్చర్యపోయేలా ప్రతీ ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని సిఎం ఆకాంక్షించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.