Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Now it is CBN and KCR turn!

By   /  May 9, 2016  /  Comments Off on Now it is CBN and KCR turn!

    Print       Email

babu with kcr2ఇక బాబు..కేసీఆర్ వంతు!

 

InCorpTaxAct
Suvidha

 

 

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా నెల‌కొన్న‌క‌రువుపై దృష్టి పెట్టారు. అందులో భాగంగానే దేశ వ్యాప్తంగా తీవ్ర క‌రువు ప్రాంతాల‌ను గుర్తించి ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాని మాట్లాడుతున్నారు. అక్క‌డ తీసుకోవాల్సిన స‌హాయ చ‌ర్య‌ల‌తో పాటు ఆయా ప్రాంతాల్లో రాష్ట్ర ప్ర‌భుత్వాలుఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందుతోంది. అందే సాయంలో ప్ర‌జ‌ల‌కు ఎంత చేరుతోంద‌నే విషయాల‌పై స్వ‌యాన ఆయా రాష్ట్రాల మ‌ఖ్య‌మంత్రుల‌ను పిలిపించుకుని స్వ‌యాన ప్ర‌ధానే ఆరాతీస్తున్నారు. అయితేఇప్ప‌టికే మొదటి విడత కింద మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ – ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ – కర్నాటక సిఎం సిద్ధరామయ్యలతో వారి రాష్ట్రాల్లో నెలకొన్న కరువు పరిస్థితులు – ప్రజలు ముఖ్యంగా రైతులను ఆదుకునేందుకు తీసుకున్న చర్యలు – కేంద్ర ప్రభుత్వం అందజేసిన సహాయం – సహాయ – పునరావాస చర్యల గురించి చర్చించారు.

తాగునీటి సరఫరా గురించి సమీక్షించటంతోపాటు పశుగ్రాసం లభ్యతపై కూడా వారు దృష్టి సారించారు. కరువు తీవ్రంగా ఉన్నందుకే మోదీ మొదట ఉత్తరప్రదేశ్ – మహారాష్ట్ర కర్నాటక ముఖ్యమంత్రులతో విడివిడిగా చర్చలు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. కరువు నెలకొన్న ఇతర రాష్ట్రాల సీఎంలతో కూడా చర్చలు జరుపుతారని పీఎంఓ అధికారులు చెబుతున్నారు. ఇదే జ‌రిగితేమాత్రం త్వ‌ర‌లోనే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తోను,ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడుతో స‌మావేశం కానున్నారు. ఢిల్లీ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఈ స‌మావేశానికి కొంత ప్రాధాన్య‌త సంత‌రించుకోనుంది. ప్ర‌స్తుత క‌రువు ప‌రిస్థితుల నేప‌థ్యంతో నీటి స‌మ‌స్య కూడా తెర‌పైకి రానుంది. తెలంగాణ ప్ర‌భుత్వం ఎత్తిపోత‌ల ప‌థ‌కాల ద్వారా తోడుకోనున్నా నీటి చంద్ర‌బాబు ప్ర‌స్తావిస్తే దానిపై మోడీ ఎలా స్పందిస్తారోన‌ని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →